మీరు మారాలి!

అమ్మాయిలు చాలావరకూ తమ పని తాము చేసుకునిపోతే చాలు అనుకుంటారు. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగినులు... నాయకత్వ లక్షణాలకు సానపెట్టుకోవాలి. అందుకోసమే ఈ సూచనలు. అందరికీ అన్ని విషయాలూ తెలియాలని లేదు. నాకేమీ రాదు... ఏమీ తెలియదు అనే మాటలొద్దు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. నేర్చుకోండి. నాయకురాలిగా ఎదగాలంటే... మీ

Published : 02 Sep 2021 01:02 IST

అమ్మాయిలు చాలావరకూ తమ పని తాము చేసుకునిపోతే చాలు అనుకుంటారు. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగినులు... నాయకత్వ లక్షణాలకు సానపెట్టుకోవాలి. అందుకోసమే ఈ సూచనలు.

తెలుసుకోండి...: అందరికీ అన్ని విషయాలూ తెలియాలని లేదు. నాకేమీ రాదు... ఏమీ తెలియదు అనే మాటలొద్దు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. నేర్చుకోండి. నాయకురాలిగా ఎదగాలంటే... మీ పరిధిలో ఉన్న అంశాలపై కనీస పరిజ్ఞానం, నేర్చుకోవాలన్న పట్టుదల కావాలి. అవి మీలో ఉంటే... ఎదుగుదల సాధ్యమే. ముఖ్యంగా... సంస్థల విధానాలు - వ్యవహారాలు, పని సంస్కృతి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఆ మార్పుకు తగ్గట్టు మనం కూడా ఎదుగుతూ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకుంటూ పోవాలి. అలా నేర్చుకోవడానికి పనివేళల్లో అవకాశం లేకపోతే బయట ప్రత్యేకంగా శిక్షణ తీసుకోండి. అందుకు సంబంధించిన పుస్తకాలు చదవండి.

నోరువిప్పండి: ఎంత నైపుణ్యం ఉన్నా... అది ప్రదర్శించాల్సిన సమయంలో ప్రదర్శించకపోతే వృథానే. మిమ్మల్ని గుర్తించాలంటే... ప్రజెంటేషన్‌ స్కిల్స్‌ కూడా అవసరం. మొహమాటం వృత్తిలో, బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో అస్సలు పనికిరాదు. అలా ఉండగలిగితేనే నాయకురాలిగా నిలబడగలరు.

వ్యక్తిత్వమే బలం... మనతో పనిచేసే వాళ్లందరూ మనకు బెస్ట్‌ఫ్రెండ్స్‌ కానక్కర్లేదు. కానీ మీరు పైపైకి ఎదుగుతుంటే మీకు మద్దతిచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండాలి. కాబట్టి వివాదాలకు దూరంగా ఉండండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, ఒకరివైపే మొగ్గు చూపించడం, పక్షపాతంగా వ్యవహరించడం వంటివి చేయకూడదు. చిన్న చిన్న వ్యక్తిత్వ లోపాలను అధిగమించగలిగితే... మీరే నాయకురాలు. విజయోస్తు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్