Published : 06/09/2021 01:21 IST

అనుభవాలు తెలుసుకోండి

ఉద్యోగంలో చేరిన మొదట్లో అంతా కొత్తగానే ఉంటుంది. వెళ్లిన మొదటి రోజే అన్నీ తెలుసుకోవాలని, నేర్చుకోవాలని అనుకోవడం అత్యాశే అవుతుంది. క్రమక్రమంగా అన్ని నేర్చుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలంటే ఉద్యోగినిగా కొన్ని పద్ధతులను పాటించాలి. అవేంటో చూద్దామా...

* మీరు పనిచేసే చోటు, పనిగంటలు, జీతం, ప్రయోజనాలు... ఇలా అన్నింటి గురించి మీకున్న సందేహాలను సహోద్యోగులను కాకుండా మానవ వనరుల అధికారిని ముందే అడిగి తెలుసుకోండి.

* ఆఫీసు వాతావరణాన్ని గమనించి అందుకు అనుగుణంగా ఉండే ఆహార్యాన్ని ఎంచుకోండి.

* కొన్ని సంస్థలు పని వేళల్లో ఉద్యోగులు సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవడానికి అంగీకరించవు.అలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయేమో ముందే కనుక్కోండి.

* ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ఎక్కువగా వినడానికే ప్రాధాన్యం ఇవ్వండి. సహోద్యోగులు, సీనియర్స్‌ చెప్పే సలహాలు, సూచనలు పాటించండి. సంస్థ గురించి తెలుసుకోండి.

* పని వాతావరణంలో అందరితో కలిసిపోవడానికి, మంచిగా నడుచుకోవడానికి ప్రయత్నించండి. స్నేహపూర్వకంగా మెలగండి.

* వీలైనంత మటుకు కార్యాలయానికి సమయానికి వచ్చేలా ప్రణాళిక వేసుకోండి. అందుకనుగుణంగా మీ పనులు చేసుకోండి. అనుకున్న సమయం కంటే కాస్త ముందుగానే ఇంటి నుంచి బయలు దేరితే సమయానికి ఆఫీసుకు రాగలుగుతారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి