Updated : 08/09/2021 04:46 IST

తమిళనాట మహిళా అర్చకులు

తమిళనాట ఆలయాల్లో అర్చకత్వం చేయడానికి ఆ రాష్ట్రప్రభుత్వం మహిళలకు స్థానం కల్పించింది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి తొలిసారిగా ఓ మహిళను అర్చకురాలిగా నియమించగా, ఇప్పటి ముఖ్యమంత్రి స్టాలిన్‌ మరో మహిళకు ఈ రంగంలో స్థానాన్ని కల్పించారు. అలా తాజాగా చెన్నైకి చెందిన 28 ఏళ్ల సుహంజనా గోపీనాథ్‌ అర్చకురాలిగా బాధ్యతలను తీసుకున్నారు. ఆ నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి చేతులమీదుగా ఆమె అందుకున్నారు.

గవారికి ప్రాముఖ్యతనిచ్చే ఈ రంగంలో మహిళలకూ అవకాశం ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం భావించింది. ఈ ఏడాది మొత్తం 208 మందిని అర్చకులుగా నియమించగా, వారిలో సుహంజన ఒకరు. దీంతో ఈమె ఈ బాధ్యతలను అందుకుని, రాష్ట్రంలో రెండో అర్చకురాలిగా నిలిచారు. చెన్నైలోని ధెనుపురీశ్వర్‌ ఆలయంలో విధుల్లో చేరిన ఈమె, మూడేళ్లపాటు పండితులు కరూర్‌ సామినాథన్‌ వద్ద శిక్షణ తీసుకున్నారు. 13 ఏళ్లు ఆలయాల్లో అర్చకుల వద్ద పనిచేశారు. ఆ అనుభవమే ఈ అవకాశాన్ని ఇప్పించింది అంటారీమె. ‘చిన్నప్పటి నుంచి భగవంతుడికి సేవ చేయాలనుకునే దాన్ని. ఇప్పుడు నా కల నెరవేరింది. వేద పాఠశాలలో చేరి శ్లోకాల పఠనం, శైవ, వైష్ణవ ఆలయాల్లో పూజలు నిర్వహించడంలో శిక్షణ తీసుకున్నా. ఈ విధులను చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఉద్యోగంలా భావించడం లేదు. ఇది మన సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించింది. అర్చకురాలిని అవ్వడం కోసం 15 ఏళ్లపాటు కృషి చేశా. అయితే ప్రస్తుతం చాలా మంది ఏడాదిలోపే కోర్సు పూర్తిచేసి ఈ రంగంలోకి అడుగు పెడుతున్నారు. సంపూర్ణంగా దీనిపై మనసు పెట్టి చేయగలిగే ఏకాగ్రత ఉన్నవారే ఈ రంగంలో పూర్తి బాధ్యతలను నిర్వర్తించగలరు. భగవంతుడికి సేవ చేయాలనే నా లక్ష్యాన్ని సాధించడంలో మా వారు, అత్తామామల ప్రోత్సాహం ఎంతో ఉంది. మగవారికి మాత్రమే అవకాశం ఉండే ఈ రంగంలో నాకు స్థానం దక్కడం లింగ సమానత్వానికి మొదటి మెట్టులా అనిపిస్తోంది’ అని చెబుతోంది సుహంజన.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి