చాక్లెట్‌ తెచ్చే అందమిది

ముందుగా చాక్లెట్‌ని కరిగించాలి. దానిలో చెంచా తేనె, కోడిగుడ్డులోని తెల్లసొన, కాస్త నిమ్మరసం వేసి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పూత వేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీంతో జిడ్డు తొలగి చర్మం నిగారింపుగా కనిపిస్తుంది.

Updated : 16 Sep 2021 04:49 IST

తియ్యని చాక్లెట్‌ అంటే ఇష్టపడని వారెవరు! అయితే దీన్ని కేవలం తినడానికే కాదు... సౌందర్యపోషణకూ వినియోగించొచ్చు తెలుసా?

ముందుగా చాక్లెట్‌ని కరిగించాలి. దానిలో చెంచా తేనె, కోడిగుడ్డులోని తెల్లసొన, కాస్త నిమ్మరసం వేసి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పూత వేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీంతో జిడ్డు తొలగి చర్మం నిగారింపుగా కనిపిస్తుంది.

* పావుకప్పు చాక్లెట్‌లో చెంచా తేనె, నాలుగు చెంచాల ఎప్సమ్‌ సాల్ట్‌ వేసి....ఆ మిశ్రమాన్ని ఒంటికి రాసుకుని మృదువుగా రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు పోయి చర్మం మృదువుగా మారుతుంది.

* ముఖం నిర్జీవంగా ఉన్నప్పుడు రెండు టేబుల్‌ స్పూన్ల కరిగించిన చాక్లెట్‌లో చెంచా బాదం పేస్టు, కాస్త ఆలివ్‌ నూనె కలిపి ఈ మిశ్రమాన్ని....ముఖానికి రాసుకోవాలి. పావుగంట ఆరనిచ్చి వేళ్లను నీళ్లతో తడుపుతూ మర్దన చేయాలి. దీనివల్ల చర్మం శుభ్రపడుతుంది. కాంతిమంతంగా మెరిసిపోతుంది.

* సరైన పోషణ లేక కొన్నిసార్లు ముఖంపై ముడతలు పడి అసలు వయసు కంటే పెద్దగా కనిపిస్తాం. ఇలాంటప్పుడు చాక్లెట్‌ ద్రవంలో కోడిగుడ్డులోని తెల్లసొన, ఐదారు చుక్కల రోజ్‌ ఆయిల్‌ కలిపి బాగా గిలకొట్టండి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే సమస్య దూరమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్