Published : 21/09/2021 01:18 IST

సవాళ్లు స్వీకరిస్తేనే నాయకత్వం!

మగవారితో సమానంగా అమ్మాయిలూ కెరియర్‌లో దూసుకుపోతున్న రోజులివి. అయితే పనిలో పేరు తెచ్చుకోవాలన్నా, ఉన్నతంగా స్థిరపడాలన్నా...  కొన్ని ప్రాథమిక సూత్రాల్ని మరిచిపోకూడదు. అవేంటంటే...

మనసుకి కళ్లెం: నలుగురితో పనిచేసేటప్పుడు ఒడుదొడుకులు సహజమే. అలాగని చిన్నవాటికే కోపం తెచ్చుకోవడం, ఆ ఆక్రోశాన్ని మాటల తూటాలు పేల్చడం, ఇవేవీ కాదంటే కన్నీళ్లు పెట్టుకోవడం అస్సలు చేయొద్దు. మీదే పై చేయి కావాలని భావించి వాదనలకు దిగొద్దు. ఇతరుల అభిప్రాయానికి గౌరవం ఇస్తూనే మీరనుకున్న విషయాన్ని స్థిరంగా చెప్పండి. ఒక్కమాటలో చెప్పాలంటే... భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. మనసుని అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే... సరిగా ఆలోచించ గలరు. ఉన్నతంగానూ ఎదగగలరు.

మార్పు అవసరం: ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఉండే ఉత్సాహం ఏళ్లు గడిచినా కనిపించాలి. ఎప్పటికప్పుడు మార్కెట్‌లో, మీ సంస్థలో జరిగే పరిణామాల్ని, భవిష్యత్తు అవసరాల్నీ అంచనా వేయడంలో ముందుండాలి. పరిస్థితులకు అనుగుణంగా  నైపుణ్యాలు ఉపయోగపడితేనే లక్ష్యాన్ని చేరుకోగలం.

సవాళ్లను స్వీకరించండి... చాలామంది మహిళలు సవాళ్లు తీసుకునేందుకు భయపడతారంటారు. మీ వరకూ వస్తే బాధ్యతల్ని అందిపుచ్చుకోవడానికి సదా సంసిద్ధంగా ఉండాలి. సమస్య ఏదైనా నేనున్నానే భరోసా ఇవ్వాలి. అలాగని ఇతరుల విషయాల్లో, పనుల్లో జోక్యం చేసుకోమని కాదు. మీకంటూ కొన్ని ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు అవసరం. ఇబ్బంది ఎదురైనప్పుడు సులువుగా పరిష్కరించుకోవడానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవడమూ ముఖ్యమే. ఈ విషయాలన్నింటిపై అవగాహన, ఏదైనా చేయగలమనే భరోసా, చొరవ ఉంటే... మీరు నాయకురాలిగా మారడం సులువే.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి