మనసు సిద్ధమేనా?

తాజా పట్టభద్రుల ఉద్యోగ వేటను కొవిడ్‌ మరింత క్లిష్టతరం చేసింది. ముందే ఆన్‌లైన్‌ పాఠాలు, ప్రాజెక్టులతో బయటి ప్రపంచంతో పరిచయం తగ్గింది. దీంతో సంస్థల నుంచి స్పందన రాకపోవడంతో కొంత ఒత్తిడి సాధారణమే. అమ్మాయిల

Updated : 30 Sep 2021 02:00 IST

తాజా పట్టభద్రుల ఉద్యోగ వేటను కొవిడ్‌ మరింత క్లిష్టతరం చేసింది. ముందే ఆన్‌లైన్‌ పాఠాలు, ప్రాజెక్టులతో బయటి ప్రపంచంతో పరిచయం తగ్గింది. దీంతో సంస్థల నుంచి స్పందన రాకపోవడంతో కొంత ఒత్తిడి సాధారణమే. అమ్మాయిల విషయంలో ఇది ఇంకాస్త భయాన్ని పెంచుతోందంటున్నారు నిపుణులు. ముందు ఈ స్థితి నుంచి బయటపడాలంటున్నారు.

* ఎప్పటికప్పుడు రెజ్యూమెను అప్‌డేట్‌ చేసుకోండి. దరఖాస్తు చేస్తున్న సంస్థకు తగ్గట్టుగా దానిలో మార్పులు చేసుకుంటుండాలి. అలాగే గంటల కొద్దీ వెతకడమే పనిగా పెట్టుకోవద్దు. ఓ రెండు, మూడింటికి దరఖాస్తు చేసుకుని వాటికి సిద్ధమవ్వండి. ఏ జవాబూ రాకపోతే ఆ తర్వాతే వేరే వాటికి ప్రయత్నించండి. పరిశ్రమ గురించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. దానికి తగ్గట్టుగా అవసరమైతే నైపుణ్యాలను పెంచుకోండి. కొత్త భాషలపైనా దృష్టి పెట్టండి.

* ఆర్థిక సమస్యలుంటే.. రాబడి, చెల్లింపులను జాబితాగా రాసుకోండి. దానికి తగ్గట్టుగా ఖర్చులేమైనా తగ్గించుకోవచ్చేమో చూసుకోండి. తర్వాత ఆన్‌లైన్‌లో సీరియస్‌ ఉద్యోగమే కాకుండా నచ్చిన సమయంలో చేసే వ్యాపకాలతోనూ సంపాదించుకునే అవకాశాలెన్నో. వాటినీ ప్రయత్నించొచ్చు. సగం ఒత్తిడి తగ్గుతుంది.

* ఉద్యోగం రావట్లేదన్న కారణంతో టీవీతోనో, సోషల్‌ మీడియాతోనో కాలక్షేపం చేయొద్దు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పక్కన పెట్టేయొద్దు. శరీరంతోపాటు మానసిక ఆరోగ్యానికీ, వ్యాయామానికీ ప్రాధాన్యమివ్వండి. అప్పుడే మెదడూ చురుగ్గా పని చేస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా.. దేన్నైనా సాధించడం సాధ్యమయ్యేది? కాబట్టి ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్