కాఫీ గాంధీతో గిన్నిస్‌ రికార్డు

బాపూని చరిత్ర పాఠంగా కాకుండా నేటితరం ఇంకా గుండెల్లో పెట్టుకుందని నిరూపించే ప్రయత్నం చేసింది ఒంగోలుకు చెందిన ఆదిపూడి దేవిశ్రీ. కాఫీపొడితో ఆమె చిత్రించిన బాపు బొమ్మ గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కి అందరి ప్రశంసలూ అందుకుంటోంది...

Published : 02 Oct 2021 00:58 IST

బాపూని చరిత్ర పాఠంగా కాకుండా నేటితరం ఇంకా గుండెల్లో పెట్టుకుందని నిరూపించే ప్రయత్నం చేసింది ఒంగోలుకు చెందిన ఆదిపూడి దేవిశ్రీ. కాఫీపొడితో ఆమె చిత్రించిన బాపు బొమ్మ గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కి అందరి ప్రశంసలూ అందుకుంటోంది...

చిన్నతనం నుంచీ చిత్రలేఖనం అంటే ప్రాణం పెట్టేది దేవిశ్రీ. ఆమె ఇష్టాన్ని గుర్తించిన అమ్మానాన్నలు నరేంద్ర, నాగలక్ష్మి ఐదోతరగతి నుంచే ఓ గురువు దగ్గర శిక్షణ ఇప్పించారు. చిత్రకళలోనూ తనకేదైనా ప్రత్యేకత ఉండాలని దేవి తపించేది. తన ఆసక్తి చూసి నెయిల్‌పాలిష్‌, కాఫీపొడి తదితరాలతో కాన్వాస్‌పై అద్భుతమైన చిత్రాలు వేయొచ్చన్న గురువు తిమ్మిరి రవీంద్ర మాటల నుంచి స్ఫూర్తి పొందింది దేవి. మదర్‌థెరీసా వంటి వారి చిత్రాలను గీసి అనుభవం సంపాదించింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే మూడేళ్ల క్రితం 40 కిలోల కాఫీపొడిని వాడి అతిపెద్ద గాంధీ చిత్రాన్ని గీసింది. దాన్ని రికార్డుగా ధ్రువీకరిస్తూ గిన్నిస్‌ వర్గాల నుంచి సమాచారాన్ని అందుకుంది. ఆ వివరాలను అప్పుడే పంపినా కరోనా వల్ల ధ్రువీకరణ రావడం ఆలస్యమైంది. ఇప్పటి వరకూ అతిపెద్ద కాఫీ చిత్రం 137 మీటర్లుగా నమోదైంది. 150 చ.మీటర్ల గాంధీ చిత్రంతో దాన్ని అధిగమించింది దేవి. దీన్ని రూపొందించడానికి 33 గంటలు శ్రమించింది. కాఫీ పొడిని ద్రవ రూపంలోకి మార్చి దాన్నే రంగుగా వినియోగించింది. 15 మీటర్ల పొడవు, పది మీటర్ల వెడల్పులో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దింది. గిన్నిస్‌ స్ఫూర్తితో నైపుణ్యాలను మరింత పెంచుకుని మరిన్ని ప్రయోగాలు చేస్తానంటోంది ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న దేవిశ్రీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్