Updated : 03/10/2021 01:57 IST

ఈ నైపుణ్యాలు మీకున్నాయా..

కాలేజీ ఫస్ట్‌ వచ్చిన కళ, జాబ్‌ ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోయింది. చదువుకు సంబంధం లేని ఆ ప్రశ్నలన్నీ జీవన నైపుణ్యాలకు చెందినవని కళకు తెలీదు. ఈమెలాంటి వారెందరో ఈ తరహా సమస్యలను నెదుర్కొంటున్నారు. వీటిని గుర్తించే దిశగా వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఒక అధ్యయనం చేసి కొన్ని నైపుణ్యాలు అందరికీ అవసరమని ప్రకటించింది. వీటిని ప్రతి ఒక్కరూ పాఠశాల స్థాయి నుంచే నేర్చుకోవాల్సిన అవసరం ఉందనీ సూచించింది. అవేంటో తెలుసుకుందాం.

* మన గురించి మనం... ప్రతి అమ్మాయి తన గురించి తాను తెలుసు కోవాలి. ఇష్టమైనది, ఇష్టం లేనిది, అభిరుచి, తనపై తనకున్న అభిప్రాయం వంటివన్నీ తెలుసుకోవాలి. చాలామంది ఎదుటివారు తమ గురించి చెప్పిందే నిజమనుకుంటారు. ముందు మనమేంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఎవరికివారు వారి లక్ష్యాన్ని నిర్దేశించుకోగలుగుతారు. విజయాన్ని సాధించేందుకు కృషి చేస్తారు.

* మానవ సంబంధాలు... కుటుంబం, స్నేహితులతో మంచి సంబంధాలను ఏర్పరుచుకోవాలి. అప్పుడే అందరితో కలిసిపోయే మనస్తత్వం అలవడుతుంది. ఇది బృందంతో కలిసి పనిచేసే నైపుణ్యాలను పెంచుతుంది. నలుగురితో ఎలా మాట్లాడాలి, ఏయే సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినడం వంటి పలు అంశాలను తెలుసుకోవచ్చు. అలాకాకుండా చిన్నప్పటి నుంచి ఒంటరితనం అలవడితే, అది వారిని జీవితంలో ఒంటరిగానే మిగులుస్తుంది. 

* భావోద్వేగాల అదుపు... కోపం, భయం, బాధ వంటి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోతే ఆ ప్రభావం బంధాలను బలహీనం చేస్తుంది. అది ఒత్తిడి, ఆందోళనకు గురిచేస్తుంది. వీటిని నియంత్రించుకోవడమే కాదు, సరైన దిశగా వినియోగించుకోవడం సాధన చేస్తే ఇటువంటివన్నీ జయించొచ్చు. ముందుగా ఎలాంటి అంశాలకు సంబంధించి కోపం వస్తుందో వాటిని మనమే గుర్తించ గలగాలి. కారణాన్ని తెలుసుకుంటే దాన్ని జయించొచ్చు. ఆ సందర్భాల్లో పోషించాల్సిన పాత్రకు ప్రాముఖ్యతనిస్తే చాలు. ప్రతి దశలోనూ విజయం సొంతమవుతుంది.

* బలం, బలహీనత... ప్రతి వ్యక్తీ తన బలం, బలహీనతను గుర్తించగలగాలి. బలాన్ని పెంచుకోవడానికి కృషి చేయాలి. అలాగే జీవితంలో ఎదురయ్యే ప్రతి సంబంధానికీ ఉండే ప్రాముఖ్యతను తెలుసుకొని, సమన్వయం చేసుకోగలిగితే ఇవన్నీ నైపుణ్యాలుగా మారి, జీవితంలో, కెరియర్‌లో దూసుకెళ్లొచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి