ఇల్లంతా పూ లతలే..

ఇంట్లో ప్రతి గదిని పూలతో నింపేస్తే ఆ అందం రెట్టింపు అవడం ఖాయం. అదెలా అంటారా... గదిలోని వస్తువులు, గోడలకు పూల అందాన్ని అద్దితే చాలు అందంతో పాటు ప్రశాంతతా మీ సొంతం అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. అదెలాగో కూడా చెబుతున్నారు.

Updated : 03 Oct 2021 01:58 IST

ఇంట్లో ప్రతి గదిని పూలతో నింపేస్తే ఆ అందం రెట్టింపు అవడం ఖాయం. అదెలా అంటారా... గదిలోని వస్తువులు, గోడలకు పూల అందాన్ని అద్దితే చాలు అందంతో పాటు ప్రశాంతతా మీ సొంతం అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. అదెలాగో కూడా చెబుతున్నారు.

* ముందుగదికి... హాలులో సోఫా /కుర్చీలను ఫ్లోరల్‌ డిజైన్‌ లేదా ఒకేరకమైన ముదురు వర్ణంలో ఎంపిక చేసుకోవాలి. ఇవి గోడల వర్ణాలకు కాంట్రాస్ట్‌గా ఉంటే ప్రత్యేకంగా అనిపిస్తాయి. దిండ్లకు కూడా పూల డిజైన్ల కవర్లు ఇంపుగా కనిపిస్తాయి. ముదురు వర్ణంలో పెద్ద పూల కార్పెట్‌ను పరిస్తే.. హాలుకు ప్రత్యేక ఆకర్షణనిస్తుంది. పూలతల వాల్‌పేపర్‌ను ఎంచుకుంటే చాలు.. గదంతా పూలమయమే అనిపించేలా కనికట్టు చేస్తుంది.

* పడకగదిలో... ఈ గదికి లేతవర్ణాలను ఎంచుకోవాలి. కర్టెన్లకు లైట్‌ కలర్‌లో ఫ్లోరల్‌ డిజైన్‌ ఉండాలి. బెడ్‌షీట్‌కు కర్టెన్‌కు మ్యాచింగ్‌గా చిన్నచిన్న పూలు పరిచినట్లుగా ఉండేలా ఎంపిక చేసుకోవాలి. తలగడ కవర్లు కూడా పూలతలతో తేలిక వర్ణాల్లో ఉంటే ప్రశాంతతంగా హాయిగా అనిపిస్తుంది. బెడ్‌ పక్కన కుర్చీకి ముదురు వర్ణం గులాబీల్లాంటి డిజైన్‌ కవరుంటే గదిలోని రంగులన్నీ సమన్వయం అయినట్లుగా కనిపిస్తాయి.

* వంటిల్లు...  కుటుంబ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచాలంటే పోషకవిలువలుండే ఆహారాన్ని తయారుచేయాలి. అంతటి ప్రత్యేకత ఉన్న ఈ గది మనసును ఉత్సాహంగా ఉంచగలిగితేనే రుచికరమైన వంటకాలు సిద్ధమవుతాయి. జిడ్డు పట్టిన గోడలు, అలమరలు ఆందోళనను కలిగిస్తాయి. అలాకాకుండా ఉండాలంటే గోడలకు ముదురు వర్ణంలో ఫ్లోరల్‌ డిజైన్‌లో వాల్‌పేపరును ఎంచుకోవాలి. పొయ్యి వెనుక గోడకూ పూలడిజైన్లలో షీట్స్‌ దొరుకుతున్నాయి. వీటిని అమర్చితే అలసట దరిచేరదు.

* రీడింగ్‌రూం...  పుస్తకాల అలమర పక్కన కుర్చీకి ముదురు, లేత వర్ణాల కలయికలో పూలతల డిజైన్‌ ఎంచుకోవాలి. అందులో మెత్తని దిండుపై కాంట్రాస్ట్‌ రంగు పూలుండాలి. కిటికీ పక్కగా సీటింగ్‌కు, స్నానాలగదిలోనూ గోడలకూ ముదురువర్ణాల పూలతలుండే వాల్‌పేపర్‌ను వేస్తే చాలు. ప్రతి గదికీ ప్రత్యేక అందాన్ని తెచ్చే ఈ పూలతలను మీ ఇంటికీ తీసుకొచ్చేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్