Published : 04/10/2021 01:28 IST

ప్రణాళికను మార్చేద్దాం!

ఇంటి పనీ, ఆఫీసు బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో మహిళలం కాస్త ఎక్కువే ఒత్తిడికి గురవుతాం. ఇది అలసట, నిస్సత్తువకు కారణం అవుతుంది. అలాకాకుండా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.

చాలామందికి వ్యాయామం అలవాటు ఉంటుంది కానీ ఆఫీస్‌ నుంచి వచ్చాక ఇందుకు సమయం కేటాయిస్తారు. అలాకాకుండా ఉదయం వేళల్లోనే ఆ పని చేయండి. ఎందుకంటే శారీరక శ్రమ తర్వాత మన శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్‌లు మనల్ని నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా కాపాడతాయి. ఆలోచనల్లో ఓ స్పష్టతనిస్తాయి. ఆ ఉత్సాహం మీకు రోజంతా ఉంటుంది.

తల్లిగా, భార్యగా, ఉద్యోగినిగా...మీరు ఎన్నో పనులను మల్టీటాస్కింగ్‌ చేస్తూ ఉండి ఉండొచ్చు. మరెన్నో చేయాలనే ఆలోచనలూ మీ మెదడులో తిరగొచ్చు. అయితే వాటన్నింటినీ మీ ‘టు-డూ’ జాబితాలో పెట్టేయకండి. ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయండి.

మన పని మొదలయ్యే తొలి నాలుగు గంటల్లో మన సామర్థ్యం పూర్తిస్థాయిలో ఉంటుంది. కాబట్టి కీలకమైన పనులన్నీ అప్పుడే పూర్తిచేసేలా మీ ప్రణాళిక ఉండాలి.  సరైన పోషకాలు తీసుకోవడం ఎంత అవసరమో! శరీరానికి కదలిక అంతే ముఖ్యం. గంటకోసారైనా నీళ్లు తాగండి. స్వేచ్ఛగా శరీరాన్ని కదుల్చుతూ నడవండి. వీలైతే చిన్నపాటి స్ట్రెచస్‌ చేయండి. కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి