విజయానికి  ఆరు అంశాలు!

ఉద్యోగినిగా ఉన్నత స్థానాలను అందుకోవాలంటే నిరంతర విద్యార్థిలా మారాలి. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. ఎలా అంటే..

Updated : 05 Oct 2021 05:38 IST

ఉద్యోగినిగా ఉన్నత స్థానాలను అందుకోవాలంటే నిరంతర విద్యార్థిలా మారాలి. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. ఎలా అంటే..

* కేర్‌... జీవితంలో ఏం సాధించాలన్నా ముందు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ఆహారం, వ్యాయామాల మీద దృష్టి పెట్టాలి. శరీరానికి తగినంత విశ్రాంతీ ఇవ్వాలి. అప్పుడే అది పునరుత్తేజంతో ఉంటుంది.

* బీ కైండ్‌...  అవసరమున్న వారికి చేతనైన సాయం చేయాలి. మీకంటే తక్కువ స్థాయి వారి పట్ల దయ, జాలి, కరుణ కలిగి ఉండాలి. తోటి ఉద్యోగులతో కలిసి మెలిసి ఉండాలి. సాయం చేయడానికి ముందుండాలి.

* నాలెడ్జ్‌.. చేస్తున్న పని పట్ల పూర్తి అవగాహన, జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అలాగే మీ చుట్టూ ఉన్నవారికి మీ జ్ఞానాన్ని పంచగలగాలి.

* లెర్న్‌... జీవితంలో ఎదగాలంటే ఎప్పుడూ ఏదో ఒకటి తెలుసుకుంటూనే, నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలరు.

* థింక్‌ పాజిటివ్‌.. మన ఆలోచనా విధానాన్ని బట్టే మన జీవితం  ఉంటుంది. కాబట్టి సానుకూలంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మన చుట్టూ వాతావరణం అంతా పాజిటివ్‌గా ఉంటుంది.

* టెక్నాలజీ... రోజురోజుకూ సాంకేతికత చాలా వృద్ధి చెందుతోంది. దాన్ని అందిపుచ్చుకోవాలి. దాన్ని ఉపయోగించి మీ పనిని మరింత బాగా ఎలా చేయొచ్చో అధ్యయనం చేస్తూ ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్