close
Updated : 07/10/2021 00:49 IST

టెక్‌ విరామం తీసుకోండి

ఇంటి నుంచి పనిచేసే మహిళలకు.. సందేహాల నివృత్తి నుంచి పిల్లల చదువు వరకు ప్రతి దానికీ గాడ్జెట్స్‌ వాడక తప్పని పరిస్థితి. ఇది మానసిక ఆరోగ్యం, కుటుంబ సంబంధాల మీదా ప్రభావం చూపుతోందంటున్నారు నిపుణులు. దీనికి ఏం పరిష్కారాలు సూచిస్తున్నారో చూడండి...

సిస్టమ్‌కీ, టీవీకీ ఆఖరికి మొబైల్‌కి కూడా దూరంగా ఉండాలి. ఉదాహరణకు- ఆదివారం ‘టెక్‌ హాలిడే’ అనుకున్నారనుకోండి. ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఫోను లేనిదే నిమిషం గడవదు. ఏవైనా అర్జెంట్‌ కాల్స్‌ వస్తే? అంటారా! దీనికీ ముందుగానే సిద్ధమవ్వండి. ఆరోజంతా మీకు ఫోన్‌ అందుబాటులో ఉండదన్న విషయాన్ని తోటి ఉద్యోగులకీ, కుటుంబ సభ్యులకీ తెలియజేయండి. స్విచాఫ్‌లో పెట్టండి. మొబైల్‌ లేకముందు ఎలా ఉండేవారో అలాగే ప్రయత్నించండి. అలాగని ఏ సినిమాకో.. టెక్‌ ఆటలకో మాత్రం చెక్కేయకండి. వీటన్నింటికీ దూరంగా ఉండటమే ఉద్దేశం. కాలక్షేపం కావాలంటే.. ఏ పుస్తకమో చదవండి, పచ్చగా ఉండే చోటికి షికారుకి వెళ్లండి. స్నేహితులతో కబుర్లు చెప్పండి. హాలిడే వంటి వాటికి వెళ్లినా అవసరమైతే తప్ప దీన్ని పక్కన పడేయాలి. డిజిటల్‌ డీటాక్సింగ్‌గా వ్యవహరిస్తున్న దీన్ని ఆచరిస్తే.. సృజనాత్మకతకీ ఆస్కారముంటుంది అంటున్నారు నిపుణులు. ఆడవాళ్లకి టెక్నాలజీ కారణంగా ఎక్కువ ఆత్రుత, ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో
టెక్‌ విరామం ఆవశ్యకమంటున్నారు. విరామం ప్రకటించండి మరి!


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి