Published : 11/10/2021 01:44 IST

విరామంతో ఆరోగ్యం...

ఇంటిపని, ఆఫీసు విధులతో రోజంతా క్షణం తీరిక ఉండదు లక్ష్మికి. విరామం అంటే సమయం వృథా అనే ఆలోచనతో ఆమె రోజంతా పనిపైనే దృష్టి పెడుతుంది. అయితే! విరామం లేకుండా పనిచేసే వ్యక్తులు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం  ఎక్కువంటోంది హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ తాజా అధ్యయనం. పని మధ్యలో కొంత గ్యాప్‌ తీసుకుంటే.. అది కొత్త ఉత్సాహాన్ని పలు ఆరోగ్యకర ప్రయోజనాలనూ అందిస్తుందని ఆ నివేదిక సూచిస్తోంది. 1300 మంది మహిళల్ని ఈ సర్వే కోసం ఎంచుకున్నారు. వారిని విరామం తీసుకోకుండా, తీసుకుని పనిచేసే రెండు  బృందాలుగా విభజించారు. ‘జర్నల్‌ ఆఫ్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ సోషల్‌ సైకాలజీ’లో ప్రచురించిన ఈ అధ్యయనం మొదటి తరహా వారిలో ఒత్తిడి, ఆందోళన, ఆత్మనూన్యత వంటివి కనిపించాయి. అలానే వీరు వేగంగా పనులు పూర్తిచేయలేకపోవడాన్నీ గుర్తించారు. ఇక రెండో వర్గంవారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, వారు పూర్తి చేసిన పనిలో నాణ్యత ఉన్నట్లు గమనించారు. అందుకే గంటల తరబడి చేసే పనిలో కొంత సమయం, అలాగే వారం మధ్యలో ఓ రోజు శరీరానికి, మనసుకు విరామం తప్పనిసరని చెబుతున్నారు నిపుణులు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి