మెంటార్‌ అవసరం!

స్టార్టప్‌లతో పాటు, కార్పొరేట్‌ సంస్థల్లోనూ ఇప్పుడు ‘మెంటార్‌’ సంస్కృతి పెరిగింది. కేవలం అక్కడే కాదు... ఏ రంగంలో ఉన్న వారికైనా మెంటార్‌షిప్‌ అవసరం. కెరియర్‌లో దూసుకుపోవాలనుకునే

Updated : 15 Oct 2021 05:56 IST

స్టార్టప్‌లతో పాటు, కార్పొరేట్‌ సంస్థల్లోనూ ఇప్పుడు ‘మెంటార్‌’ సంస్కృతి పెరిగింది. కేవలం అక్కడే కాదు... ఏ రంగంలో ఉన్న వారికైనా మెంటార్‌షిప్‌ అవసరం. కెరియర్‌లో దూసుకుపోవాలనుకునే అమ్మాయిలు ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటారా? అయితే చదవండి...

మెంటార్‌గా ఎవరుండాలి: పని చేస్తున్న చోట సీనియర్లు లేదా మీ రంగంలో నిపుణులు ఎవరినైనా సరే మెంటార్‌గా ఎంచుకోవచ్చు. ఒకరి కంటే ఎక్కువ మంది మెంటార్‌లతోనూ కలిసి పని చేయొచ్చు. మెంటార్‌గా మహిళలనే ఎంచుకోవాలనీ లేదు. నైపుణ్యాల ఆధారంగా వారిని గుర్తించాలి. ఇప్పుడు వివిధ కార్పొరేట్‌ సంస్థలు, స్టార్టప్‌ హబ్‌లు ఈ మెంటార్‌షిప్‌ని ప్రోత్సహిస్తున్నాయి. నామమాత్రపు రుసుముతో మీరు కోరుకున్న గురువు నుంచి సలహాలు, సూచనలు అందుకోవచ్చు.

ఏం నేర్చుకోవాలి: మీ ప్రాజెక్టు లేదా వృత్తినైపుణ్యంలో మీ ఆసక్తుల్ని సాన పెట్టుకునేందుకు మెంటార్‌ సాయం అడగండి. వారి అనుభవాల్ని తెలుసుకోండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. కొత్తదారులు వెతకడంలో సాయం తీసుకోండి. నైపుణ్యాలను, అనుభవాలను పంచుకోవడం వల్ల మీరూ పట్టు సాధించగలరు. ఆలోచన, పని వేగం, లోపాలూ.. వంటివన్నీ సరిదిద్దుకోగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్