ఈ పనుల తీరు మార్చుకోండి

చాలా ఉద్యోగాల్లో మనం నిలబడే పని చేస్తాం. గృహిణులు వంటింట్లో ఎక్కువ సేపు నుంచుని పనిచేస్తారు. ఆఫీసులో, సోఫాల్లో గంటల తరబడి కూర్చోవడం, హ్యాండ్‌ బ్యాగుల్లో బరువులు మోయడం వంటి చాలా అలవాట్లు అనారోగ్య ముప్పుని తెస్తున్నాయి.

Updated : 15 Oct 2021 05:49 IST

చాలా ఉద్యోగాల్లో మనం నిలబడే పని చేస్తాం. గృహిణులు వంటింట్లో ఎక్కువ సేపు నుంచుని పనిచేస్తారు. ఆఫీసులో, సోఫాల్లో గంటల తరబడి కూర్చోవడం, హ్యాండ్‌ బ్యాగుల్లో బరువులు మోయడం వంటి చాలా అలవాట్లు అనారోగ్య ముప్పుని తెస్తున్నాయి.

క్కువ సేపు నిలబడినా/ కూర్చున్నా కూడా మూత్ర సంబంధిత సమస్యలు, కాళ్లు ఉబ్బడం, నడం నొప్పి వంటి అనేక సమస్యలు వేధిస్తాయి.  క్రమంగా ఊబకాయం, గుండె, గర్భాశయ సమస్యలూ తలెత్తే ప్రమాదం ఉందంటారు వైద్యులు. అందుకే అలాంటి విధుల్లో ఉండేవారు... తగిన విరామాలు తీసుకోవాలి. ప్రతి అరగంట, గంటకోసారి కూర్చోవడం, లేచి నడవడం వంటివి చేయాలి.

* రోజూ ఆఫీసుకి తీసుకెళ్లే బ్యాగు ఎంత బరువు ఉందో ఎప్పుడైనా గమనించారా? హ్యాండ్‌బ్యాగ్‌లో మొబైల్‌ ఫోన్‌, పర్సు, పుస్తకం, మేకప్‌ సామగ్రి, వాటర్‌ బాటిల్‌, తాళాలు... ఇలా చాలానే పెడతాం. అన్నీ కలిపితే కనీసం రెండు మూడు కేజీలైనా ఉండొచ్చు. అంత బరువుని రోజూ మోయడం వల్ల భుజాలు, మెడ వంటివాటిపై ఒత్తిడి పడుతుంది. వెన్ను నొప్పీ తగ్గకపోవచ్చు. శరీర భంగిమలో తేడా రావడమూ తప్పదు. అందుకే వీలైనంత వరకూ అవసరమైనవే అందులో ఉంచండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్