అది మామూలు విషయం కాదు

నెలసరి ముందు, ఆ సమయంలో కాస్త చిరాకు, విసుగు వంటివి సాధారణం. హార్మోనుల్లో వచ్చే మార్పులు అందుకు కారణం. ఒక్కోరోజు నిద్ర సరిపోకపోయినా, రోజు బాగా గడవకపోయినా కాస్త చికాకుగా ఉండటం,

Published : 19 Oct 2021 01:57 IST

నెలసరి ముందు, ఆ సమయంలో కాస్త చిరాకు, విసుగు వంటివి సాధారణం. హార్మోనుల్లో వచ్చే మార్పులు అందుకు కారణం. ఒక్కోరోజు నిద్ర సరిపోకపోయినా, రోజు బాగా గడవకపోయినా కాస్త చికాకుగా ఉండటం, పక్కవారిపై అరవడం మామూలే. కానీ అదే ప్రతిరోజూ కనిపిస్తే మాత్రం మామూలు విషయం కాదంటున్నారు నిపుణులు. దాన్ని మార్చుకోవడానికి సూచనలిస్తున్నారు.

ముందు మీలో మార్పును అంగీకరించండి. సొంతంగా గమనించకపోయినా పక్కవాళ్లు గమనిస్తారు. అలా చెబుతుంటే.. మిమ్మల్ని మీరు ఓసారి పరీక్షించుకోండి. తర్వాత ఒకటికి రెండుసార్లు ఆలోచించాకే బదుల్విండి. అప్పుడు బంధాలు దూరమవ్వవు. తరచూ అసహనానికి గురవుతుంటే కారణం కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఏదీ తట్టలేదంటే ఒత్తిడిగా భావించొచ్చు. సరిగా తినకపోవడం వల్ల కూడా ఇలా కావొచ్చు.  దాని ఆధారంగా జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరి.

విసుగు అనిపించినప్పుడల్లా అన్నీ తమకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయన్న భావన కలుగుతుంది. ఈ రకమైన ఆలోచనకి శరీరంలో కార్టిసాల్‌ అధిక మోతాదులో ఉత్పత్తి కావడమే కారణం. ఇలాంటప్పుడు ప్రశాంతమైన చోట కూర్చొని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేయడం లేదా కొద్దిసేపు శ్వాసను బంధించి ఉంచడం లాంటివి చేయాలి.

మెదడుకి తగినంత విశ్రాంతి కావాలి. గంటలపాటు పనిచేయడం, ఒకేపనిని దీర్ఘకాలంపాటు చేయడం వంటివీ ఒత్తిడి కలిగించేవే. చిన్న విరామాలు తీసుకొని పాటలు వినడం, కాసేపు నడవడం వంటివి  చేయాలి. చిన్నపాటి వ్యాయామాలూ సహకరిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆతృత, ఆందోళన, భావోద్వేగాల్లో మార్పులు, తిండిపై అనాసక్తి వంటి ఎన్నింటికో ఇదే పరిష్కారమట. రోజులో కొంత సమయం కేటాయిస్తే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్