ఇవి నెలసరి సెలవులు  

‘నాకీ రోజు బాగాలేదు’.. ‘నీరసంగా ఉంది..’లాంటి కారణాలు చూపించి నెలకోసారైనా సెలవు పెడుతుంటాం. కానీ అసలు కారణమైన ‘నెలసరి’ గురించి చెప్పడానికి బిడియ పడుతుంటాం. మహిళలకెదురయ్యే ఈ ఇబ్బందిని..

Updated : 21 Oct 2021 06:14 IST

‘నాకీ రోజు బాగాలేదు’.. ‘నీరసంగా ఉంది..’లాంటి కారణాలు చూపించి నెలకోసారైనా సెలవు పెడుతుంటాం. కానీ అసలు కారణమైన ‘నెలసరి’ గురించి చెప్పడానికి బిడియ పడుతుంటాం. మహిళలకెదురయ్యే ఈ ఇబ్బందిని అర్థం చేసుకున్న ‘స్విగ్గీ’ తన ఉద్యోగుల కోసం నెలకి రెండురోజుల నెలసరి సెలవుల్ని ప్రత్యేకంగా ఇస్తోంది. బిడియపడకుండా ఈ పీరియడ్‌ సెలవుల్ని తీసుకోవచ్చని చెబుతోంది. ‘మా మహిళా ఉద్యోగుల్లో 99 శాతం మంది 45ఏళ్ల లోపువారే. వాళ్ల సమస్యని అర్థం చేసుకునే ఈ ఏర్పాటు’ అంటున్న స్విగ్గీ డెలివరీలు తీసుకోవడానికి వెళ్లే రెస్టరంట్ల దగ్గర శుభ్రమైన వాష్‌రూమ్‌లు ఉండేటట్టు మరో ఫుడ్‌ డెలివరీ సంస్థ అయిన జొమాటోతో కలిసి ఏర్పాట్లూ చేసింది. మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వారికోసం సౌకర్యాలు ఏర్పాటు చేయడం మంచి విషయమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని