Updated : 22/10/2021 12:59 IST

మూడాఫ్‌కు ఆయింట్‌మెంట్‌

ఎప్పుడో ఒకసారి, కొద్దిసేపు మూడ్‌ పాడయితే ఫరవాలేదు. కానీ తరచుగా, అదీ గంటల తరబడి కొనసాగితే మటుకు ప్రమాదమే. ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. ఈ విషయంలో మానసిక విశ్లేషకుల సూచనలు ఇవీ...

నసెందుకు వికలమైందో విశ్లేషించుకోండి. మీ ప్రమేయం లేకుండా ఎవరి వల్లో బాధ కలిగితే ఇలాంటివి మామూలే అని సర్ది చెప్పుకొని, వీలైనంత త్వరగా బయటపడండి.

ఆశావహంగా, ఆనందంగా ఉండేవాళ్లని తల్చుకోండి, మీ వేదన తగ్గిపోతుంది.

మూడ్‌ బాగాలేదని ముడుచుకుపోయి దాన్ని జటిలం చేసుకోక కాసేపు వ్యాయామం చేయండి, హుషారొచ్చేస్తుంది.

చాక్లెట్లు బ్యాడ్‌మూడ్స్‌ని క్షణాల్లో మారుస్తాయి.

చక్కటి పాటలు వినండి, వచ్చినట్లుగా డ్యాన్స్‌ చేయండి, నచ్చినవాళ్లతో మాట్లాడండి. ఇవన్నీ అలజడి, ఆందోళనలను మాయం చేసేవే.

పెంపుడు జంతువులుంటే కాసేపు వాటితో ఆడుకోండి. లేదంటే పక్షులకు ధాన్యం గింజలు వేసి, అవి తింటుంటే చూసి ఆనందించండి.

మాటిమాటికీ మూడాఫ్‌ అవుతుంటే అందుక్కారణమైన వాళ్లని దూరం పెట్టండి.

మూడాఫ్‌ చేసుకుని దిగులుపడితే నష్టమే తప్ప లాభం లేదు. కనుక దాన్నెలా పరిష్కరించుకోవాలో ఆలోచించండి. తట్టకపోతే ఆత్మీయులతో చర్చించండి. అదే మీ సమస్యకు లేపనం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి