close
Updated : 29/10/2021 06:10 IST

నలభైల్లోనూ హుషారుగా...

ఇల్లాలికి నలభై వచ్చేసరికి ఇంటా బయటా చాలా మార్పులు వస్తాయి. వయో భారం వల్ల అత్తగారి సహకారం తగ్గి ఇంటి పని పెరుగుతుంది. పిల్లల పేచీలు ఎక్కువై అదొక ఒత్తిడి. ఆఫీసులోనూ సీనియార్టీ వల్ల పని పెరుగుతుంది. వీటన్నింటి వల్లా అలసట... ఫలితంగా చలాకీతనం తగ్గుతుంది. కొన్నిసార్లు డిప్రెషన్‌ బారినా పడొచ్చు. వీటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.

* డ్రై ఫ్రూట్స్‌: బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌, కర్బూజా, గుమ్మడి తదితర గింజల్లో పోషకాలు, పీచు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. వీటిని మార్చి మార్చి తినాలి. రోజుకు నాలుగైదు గింజల్ని నానబెట్టి తింటే సరిపోతుంది.

* తాజా పండ్లు: వీటిల్లో విటమిన్లు, మినరల్స్‌, పోషకాలు విస్తారం. స్వీట్లు, జంక్‌ఫుడ్‌కు బదులు సీజన్లలో దొరికే పండ్లు తినడం వల్ల డిప్రెషన్‌ వచ్చే అవకాశాలు తక్కువ.

* నెయ్యి: ఆరోగ్యకర కొలెస్ట్రాల్‌ ఉంటుంది. తక్కువ పరిమాణంలో దీన్ని తప్పక తినమంటున్నారు వైద్యులు.

* క్యారెట్‌: విటమిన్లు, మినరల్స్‌, పీచు పుష్కలంగా ఉండి యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తాయి. ముఖ్యంగా కళ్ల సమస్యలను అరికడతాయి.

* ఆకుకూరలు: తోటకూర, బచ్చలి, గోంగూర, కొత్తిమీర లాంటి వాటి వల్ల పోషకాలు అందుతాయి. ఊబకాయం, రక్తపోటు, హృద్రోగాల నుంచి కాపాడతాయి. మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తాయి. ఇవన్నీ తీసుకోవడంతో పాటు... సరైన వేళల్లో ఆహారాన్ని తీసుకుంటుండాలి. జంక్‌ఫుడ్‌కీ దూరంగా ఉండాలి.


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి