Updated : 29/10/2021 06:00 IST

అమ్మతనం.. ఉద్యోగభారం..

మనసూ మెదడులకు లింగ వివక్ష లేదు. సామాజిక కట్టుబాట్ల వల్లే వ్యత్యాసాలూ వేర్పాట్లూ. పెళ్లికి ముందు వృత్తి ఉద్యోగాలు ముఖ్యమనుకున్న అమ్మాయిలు పిల్లలు పుట్టాక వాటిని తగ్గించేసుకోవడం లేదా అటకెక్కించేయడం చూస్తుంటాం. అలా కాకుండా కెరియర్‌ కౌన్సిలర్లు చెప్పే సూత్రాలు పాటిస్తే అమ్మతనాన్నీ, ఉద్యోగ బాధ్యతల్నీ తేలిగ్గా చక్కబెట్టుకోవచ్చు.

* భర్త రాబడి ఉంది కదాని కెరియర్ని పక్కన పెడితే ఒకనాటికి తన ఉనికిని కోల్పోయిన భావన కలగొచ్చు. ఉద్యోగం కేవలం ఆర్జన కోసం కాదు, ఉన్నతిని స్తుందని గుర్తుంచుకోవాలి.

* పనులకు ప్రణాళిక, ప్రాధాన్యత నిర్దేశించుకుంటే తేలిగ్గా పూర్తవుతాయి.

* పిల్లల బాధ్యత తేలికైందేమీ కాదు. కానీ భర్త, అత్తమామలు వంతుల చొప్పున చూసుకునేలా ఒప్పించగలిగితే ఉద్యోగ కర్తవ్యం సులువవుతుంది.

* చిన్నారుల్ని డేకేర్‌లో ఉంచినా, ఇంట్లో ఆయాని పెట్టుకున్నా మధ్యలో పలకరిస్తూ ఉద్యోగం చేసుకుంటే రెండు పనులూ నిర్విఘ్నంగా సాగిపోతాయి.

* ఏడాది నిండని పిల్లలు పగలు పడుకుని రాత్రి మెలకువగా ఉండటం సహజం. అందువల్ల తల్లికి నిద్ర కరువవుతుంది. అలాంటి పిల్లల్ని పగలు నిద్ర పోకుండా చేసి ఆ వేళల్లో మార్పు తేవచ్చునంటున్నారు వైద్యులు.

* పిల్లల పనులు, ఉద్యోగ బాధ్యతలతో జిమ్‌కు వెళ్లేందుకు కుదరడం లేదని బాధపడనవసరం లేదు. ఇంట్లోనే వర్కవుట్స్‌ చేయొచ్చు.

* చిన్నారుల పెంపకంలో డాక్టర్లతోపాటు పెద్దల సలహాలూ సూచనలూ తీసుకోండి. ఉద్యోగంలో ఎదుగుదలకు కృషి చేయండి. కానీ వీటికి సంబంధించిన అంశాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం, ఇతరులతో పోల్చి చూడటం వద్దంటున్నారు నిపుణులు.

* జీవితం యాంత్రికంగా మారకూడదు. కనుక సరదాలూ సంతోషాలూ తప్పనిసరి అని మర్చిపోవద్దు. సెలవు రోజున కుటుంబమంతా కలిసి సినిమాకో షికారుకో వెళ్తే బడలిక తీరి కొత్త హుషారు వస్తుంది.


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి