ఆడవాళ్లా మజాకానా...
close
Published : 01/11/2021 21:30 IST

ఆడవాళ్లా మజాకానా...

ఆడవాళ్లు కుటుంబానికి సర్వం సమకూర్చినా,  ఉద్యోగమూ చేస్తున్నా కొంత చిన్నచూపు కనిపిస్తుంది. దాన్ని తిప్పికొట్టాలంటే మనమింకా గట్టిపడాలి.. అందుకు నిపుణుల సలహాలూ సూచనలూ ఇవీ...

* ఎంత దగ్గరివాళ్లయినా సరే సహాయం తీసుకోండి, కానీ మీకు చేతకాదేమోనని అధైర్య పడి ఆధారపడొద్దు. ఏ పనైనా చక్కబెట్టగలననే నమ్మకాన్ని పెంచుకోండి. నదిలో దిగే వరకే భయం, ఆనక ఈత అదే వస్తుంది.

* తోటి ఆడవాళ్లను కలుపుకోండి, ఆలోచనలూ, అభిప్రాయాలూ కలబోసుకున్నప్పుడు బలాలూ బలహీనతలూ తెలుస్తాయి, ఏ అలవాట్లు మానుకోవాలో, ఏం పనులు నేర్చుకోవాలో తెలుస్తుంది.

* కిట్టీ పార్టీల్లాంటివి ఏర్పాటు చేసుకున్నప్పుడు కెరియర్‌కి సంబంధించి చర్చలు జరపండి. మీ మనస్తత్వానికి సరిపోయే వాళ్లతో కలిసి మీకు తగిన వ్యాపారం చేయొచ్చేమో చూడండి.

చదువైపోయింది, ఉద్యోగం వచ్చేసింది ఇక తక్కిన విషయాలు మనకెందుకు అనుకోవద్దు. వార్తలు చదువుతూ లోకజ్ఞానం పెంచుకుంటే మనల్నెవరూ కించపరచరు.

* ఎప్పుడైనా విసుగ్గా, అసహనంగా అనిపిస్తే డీలా పడిపోవద్దు. కాసేపు బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లండి. ఇష్టమైన వ్యాపకాలతో గడపండి. ఇంకా ఎక్కువ ప్రశాంతత కావాలంటే ఏదైనా పర్యాటక ప్రదేశానికి వెళ్లిరండి. దిగుళ్లూ డిప్రెషన్లూ మాయమవుతాయి.

* ప్రతి నెలా కొంత పొదుపు చేయండి. అలా ఆదా చేసిన సొమ్మును ఎందులోనైనా పెట్టుబడి పెట్టండి. ఇలాంటివి ఆర్థిక వృద్ధికి దోహదం చేయడమే కాదు, ఆత్మవిశ్వాసాన్నీ రెట్టింపు చేస్తాయి. ఆడవాళ్లా మజాకానా అన్నట్టు దూసుకుపోగలుగుతారు.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని