పని పాటలా సాగితే...
close
Updated : 04/11/2021 06:23 IST

పని పాటలా సాగితే...

కొత్తగా కొలువుల్లో చేరే అమ్మాయిలు  ఆఫీసుల్లో ఎలా మెలిగితే రాణిస్తారో కెరీర్‌ కౌన్సిలర్లు సూచిస్తున్నారిలా...
అధికారులు అప్పజెప్పిన పనులను వాయిదా వేయక సమయానికి పూర్తిచేసేయండి. దాంతో ప్రశంసలు అందుకోవడమే కాదు, ఆత్మతృప్తి లభిస్తుంది. పని ఎన్నడూ మొక్కుబడిగా చేయొద్దు. ఎప్పటికప్పుడు మరింత చురుగ్గా, మెరుగ్గా ఎలా చేయగలరో ఆలోచించండి. దాని వల్ల సంస్థకి మేలు జరగడమే కాదు, మీరూ రాటుదేలుతారు.
* అధికారుల దగ్గర్నుంచి అటెండర్ల వరకూ అందరితో వీలైనంత ప్రసన్నంగా మాట్లాడండి. ఆ వినయం, సౌజన్యం మీకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా మేలు చేస్తాయి.
* తోటి ఉద్యోగులు మీలాగే ఉండాలని ఆశించొద్దు. ఒకరికి సలహాలివ్వాలని చూడొద్దు. మంచికి పోయినా పెడార్థాలు తీసేవారు ఉంటారని గుర్తుంచుకోండి. మీ వరకూ మీరు ఎంత మేలైన ఔట్‌పుట్‌ ఇవ్వగలరో ఆలోచించి ప్రణాళికతో, నిబద్ధతతో పనిచేయండి.
* కొలీగ్సే కదాని వారి వ్యక్తిగత విషయాలు అడగటం లేదా మీ సొంత విషయాలు చెప్పడం వద్దు. అందువల్ల మేలు కంటే కీడే జరుగుతుంది.  ఇంటిని ఆఫీసుకు గానీ ఆఫీసును ఇంటికి గానీ మోసుకెళ్లొద్దు. ఎక్కడి విషయాలు అక్కడే పరిష్కరించుకుంటే రెండు బాధ్యతల్నీ నిర్విఘ్నంగా నెరవేర్చగలుగుతారు.
* అన్నిటినీ మించి పనిని కష్టంగా గాక ఇష్టంగా చేయండి. ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపూ ఉండదన్నారు కవిగారు. అది దేశకాలమాన పరిస్థితులతో సంబధం లేకుండా అంతటా అందరికీ వర్తించే విలువైన మాట.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని