close
Updated : 07/11/2021 05:02 IST

సవాళ్లను స్వీకరించండి

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా... ఎదిగే క్రమంలో అడ్డంకులు సహజం. అంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎదగాలంటే కొన్ని నైపుణ్యాలు నేర్చుకోవడం, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. అప్పుడే అనుకున్నది సాధించగలం.

విజయ గాథలు స్ఫూర్తినిస్తాయి. అయితే ఫెయిల్యూర్‌ స్టోరీస్‌ కూడా తెలుసుకోవాలి. వీటివల్ల వైఫల్యం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ప్రతి వైఫల్యమూ ఒక పాఠమేనని గ్రహించాలి.

* పదిమంది నడిచిన దారిలో కాకుండా మనకంటూ ఓ దారిని ఏర్పాటు చేసుకోవాలి. ఇది సవాలే. అయినా మన ప్రత్యేకత నిలవాలంటే ఇది తప్పదు. చేయాలనుకున్న పనిని సంతోషంగా ప్రారంభించాలి. పూర్తి చేయడానికి వందశాతం మనసు పెట్టాలి.

* చాలామంది కలలు కంటారు. అయితే వాటి సాకారం కోసం మాత్రం అడుగులు వేయరు. మీరు అలా మారకండి. మీ కలలు, లక్ష్యాలకు ఓ రూపాన్నివ్వండి. నిరంతరం శ్రమించండి.

* కొత్త విషయాలు నేర్చుకుంటూ నిరంతర విద్యార్థిలా ఉంటేనే విజయం.

* ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినాలి. ఉత్తమ శ్రోత మీరైతే చాలా విషయాలను తెలుసుకుంటారు.

* ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. మీకు ఇచ్చిన ప్రతి పనిని స్వీకరించండి. పూర్తి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించండి.


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి