కొత్తయినా సాధించవచ్చు
కాస్తో కూస్తో అనుభవం ఉన్న వారికే ఉద్యోగాల్లో ప్రాధాన్యం అని చాలా మంది అనుకుంటారు. అది అన్ని ఉద్యోగాలకూ, అన్ని సమయాల్లోనూ వర్తించదు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే పెద్ద పెద్ద సంస్థలు ప్రతిభావంతులను భారీ వేతనాలు ఇచ్చి మరీ తీసుకుంటున్నాయి. అంటే ప్రతిభ, నైపుణ్యాలే ముఖ్యమని అర్థమవుతోంది కదా.
కాస్తో కూస్తో అనుభవం ఉన్న వారికే ఉద్యోగాల్లో ప్రాధాన్యం అని చాలా మంది అనుకుంటారు. అది అన్ని ఉద్యోగాలకూ, అన్ని సమయాల్లోనూ వర్తించదు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే పెద్ద పెద్ద సంస్థలు ప్రతిభావంతులను భారీ వేతనాలు ఇచ్చి మరీ తీసుకుంటున్నాయి. అంటే ప్రతిభ, నైపుణ్యాలే ముఖ్యమని అర్థమవుతోంది కదా.
అనుభవం లేకపోయినా, తగిన ప్రణాళిక, సన్నద్ధత, సరైన అన్వేషణలతో మీ కలల రంగంలో ప్రవేశించవచ్చు. చాలా మంది చదువయ్యాక ఉద్యోగావకాశాలు రాకుంటే సమయాన్ని వృథా చేస్తూ ఉంటారు. అది సరి కాదు. మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించి ఏదో ఒక ప్రత్యేకాంశంలో శిక్షణ తీసుకోవాలి. లేదా నైపుణ్యాలను పెంచుకోవాలి. దీనికి ఆన్‌లైన్లోనో, ఆఫ్‌లైన్లోనో వీలైన పద్ధతిని ఎంచుకోవాలి. ఆ రంగంలోని సంస్థల్లో ఇంటర్న్‌షిప్స్ వంటివి ప్రయత్నించాలి. జీతంతో నిమిత్తం లేకుండా... శిక్షణకు చేరాలి. దీని వల్ల అనుభవం వస్తుంది. ప్రతిభ కనబరిస్తే... ఆ సంస్థే ఉద్యోగమూ ఇవ్వవచ్చు.
అవకాశం రావాలంటే మీరు ఎంచుకున్న రంగంపై పట్టు సాధించాలి. ఇందుకు కొంత పరిశోధన అవసరం. ఆ రంగంలోని అవకాశాలను అధ్యయనం చేయాలి. దీనివల్ల మీ అర్హతలకు సరిపోయే ఉద్యోగం ఏదో తెలుస్తుంది. అప్పుడు వాటికి దరఖాస్తులు చేయవచ్చు. మీకు సరిపడని అన్నిరకాల ఉద్యోగాలకూ దరఖాస్తులు చేయద్దు. విద్యార్హతలు ఎక్కువగా ఉన్నాయని అనుభవం అవసరమైన, ఉన్నతస్థానాలు... ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తు పంపద్దు. ఉద్యోగానికి తగినట్లు రెజ్యూమె పంపాలి. విద్యార్థిగా, శిక్షణలో మీ విజయాలు, కనబరిచిన ప్రత్యేక నైపుణ్యాల వివరాలను వెల్లడించాలి. అనుభవం లేకున్నా ఆ ఉద్యోగానికి ఎలా అర్హులో.. అదంటే ఎందుకు ఆసక్తో వివరించాలి. దీనివల్ల ఇంటర్వూకు తప్పక పిలుపొస్తుంది. ఇంటర్వూలో కాస్త పరిపక్వత, అనుభవం ఉన్న వారిలా వ్యవహరించాలి.
సామాజిక మాధ్యమాలతో పాటు ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా ఉన్న వాటినీ ఉద్యోగ సాధనకు ఉపయోగించుకోవచ్చు. నిపుణులను అనుసరించడానికి, పరిచయాలు పెంచుకోవడానికివి ఉపయోగపడతాయి. వీటిలో ఆయా సంస్థలు, నిపుణులను కలుసుకోవచ్చు. అందుబాటులో ఉన్న మార్గాలను సద్వినియోగం చేసుకొంటే... అవకాశాలు మెరుగవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.