పనే కాదు.. ప్రవర్తనా ముఖ్యమే
close
Updated : 10/11/2021 05:46 IST

పనే కాదు.. ప్రవర్తనా ముఖ్యమే

‘అమ్మాయిలు సున్నితం, చేయలేరు’ అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. పని ప్రదేశమూ అందుకు మినహాయింపు కాదు. ఇది తప్పని నిరూపించడానికి కష్టపడటమొక్కటే సరిపోదు. కొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే...

కొత్తలో ప్రతిదీ తెలుసుకోడానికి ప్రయత్నించడం సాధారణమే. కానీ కాలం గడిచేకొద్దీ చుట్టూ వాతావరణంపై అవగాహన వస్తుంది. దీంతో కొంత రిలాక్స్‌ అవుతాం. విశ్రాంతి వేరు.. సమయం వెళ్లదీయడం వేరు. దీన్ని గమనించుకోవాలి. ఒక పని విషయంలో భిన్నాభిప్రాయాలు సాధారణమే. అవతలి వాళ్లు గట్టిగా చెప్పారని తగ్గాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా తీసుకుని నొచ్చుకోనక్కర్లేదు. దాన్ని మనసుకు తీసుకుని బాధ పడటమో, అవతలి వాళ్లతో దూరంగా వ్యవహరించడమో చేయొద్దు. అతిసాన్నిహిత్యం అవసరం లేదు.. కానీ పని విషయంలో సత్సంబంధాలను కొనసాగించాలి.

అభిరుచులు కలిసినపుడు త్వరగా స్నేహితులైపోవడం సాధారణమే. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగున్నా.. నలుగురిలో మాత్రం గౌరవంగానే మెలగాలి. అలాగే.. కళాశాల/ బయట ఉన్నప్పుడు దేన్నైనా వ్యక్తం చేయడానికి పెద్దగా ఆలోచించనక్కర్లేదు. కానీ కార్యాలయ వాతావరణం అలాకాదు. పనికి సంబంధించి సరే కానీ వ్యక్తిగత కాంప్లిమెంట్లు ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.

అందరి పనితీరూ ఒకలా ఉండదు. కొందరిది నచ్చకపోవచ్చు. వాటి గురించి ఇతరుల ముందు చర్చించకండి. ఆఫీసు వదంతులను విని ఊరుకోండి. వాటిపై చర్చలు, ఇతరులతో పంచుకోవడం లాంటివి వద్దు. అలాగే వ్యక్తిగత వివరాలను ఆరా తీయకండి. మీవీ పూసగుచ్చినట్టు అందరితోనూ పంచుకోకండి. అనవసర వదంతులు తయారయ్యేదిక్కడే. ఆఫీసులో పని ఎలా చేస్తున్నారనే కాదు.. ప్రవర్తన ఎలా ఉందన్నదీ ముఖ్యమే. కాబట్టి, వీటిని గమనించుకోండి.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని