close
Updated : 12/11/2021 05:43 IST

మీరే మెంటార్‌ అయితే!

అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ కార్పొరేట్‌ నిచ్చెనలపైకి ఎగబాకుతున్నారు. టీమ్‌ లీడర్లుగా సత్తా చూపుతున్నారు. మరి మీరు మెంటార్‌గా ఉండాల్సి వస్తే... ఎలా నడుచుకోవాలి?

ఉన్నత స్థానాల్లో ఉన్నప్పుడు హోదాను ప్రదర్శించడం, అన్నీ నాకే తెలుసన్నట్లుగా వ్యవహరించడం సరికాదు. ఆత్మవిశ్వాసం అవసరం... దాన్ని అతిగా మార్చుకుంటే ప్రమాదం. కింది ఉద్యోగులకు మీ అనుభవాలే స్ఫూర్తి పాఠాలు కావాలి. ఇందుకు కెరియర్లో మీ ప్రతి అనుభవాన్నీ వారితో పంచుకోవడంలో తప్పు లేదు. అప్పుడే ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనే మానసిక స్థైర్యం వారూ కూడగట్టుకోగలరు.

* కింది ఉద్యోగుల బాధ్యత తీసుకోవడమంటే.. అన్నీ విడమరచి చెప్పడమే కాదు.. వారితో సంబంధిత పనులూ చేయించాలి. నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. ఈ క్రమంలో జరిగే తప్పొప్పులను సరిదిద్దాలి. అప్పుడే సరిగ్గా అర్థం చేసుకోగలరు. ఉన్నతంగా ఎదగగలరు.

* సిబ్బంది సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు జోక్యం చేసుకోవాల్సిన సందర్భంలో మౌనంగా ఉండొద్దు. తరచూ వారితో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకోండి. అప్పుడే స్నేహపూర్వక వాతావరణం పెరుగుతుంది.

* కొన్నిసార్లు కఠినంగా కూడా చెప్పాల్సి రావొచ్చు. అలాంటప్పుడు మొహమాటాలకు పోవద్దు. చూసీ చూడనట్లు వదిలేయొద్దు. అప్పుడే వారికి క్రమశిక్షణ, నేర్చుకోవాలన్న తపన అలవడతాయి.


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి