అమ్మయ్యాకా.. అందంగా!

పిల్లలు పుట్టాక అందం తగ్గిందని బాధపడే మహిళలు ఎంతమందో! హార్మోన్లు, మందులు కొంత కారణమైతే.. పిల్లల ఆలనాపాలనలో పడి చేసే అశ్రద్ధ ఇంకో కారణం. అలాకాకూడదంటే.. మీకు మీరూ కొంత సమయం కేటాయించుకోవాలి మరి!

Updated : 13 Nov 2021 05:37 IST

పిల్లలు పుట్టాక అందం తగ్గిందని బాధపడే మహిళలు ఎంతమందో! హార్మోన్లు, మందులు కొంత కారణమైతే.. పిల్లల ఆలనాపాలనలో పడి చేసే అశ్రద్ధ ఇంకో కారణం. అలాకాకూడదంటే.. మీకు మీరూ కొంత సమయం కేటాయించుకోవాలి మరి!

రాత్రుళ్లు చర్మం తనకు తాను కొన్ని మార్పుల్ని చేసుకుంటుంది. శరీరంలోని మలినాల్ని బయటకు పంపించేస్తుంది. మీరు చేయాల్సిందల్లా బయటి నుంచీ దానిని కాస్త శుభ్రంగా ఉంచడమే! కాబట్టి.. పడుకునే ముందు తక్కువ గాఢత ఉన్న క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

* రెండు, మూడు రోజులకోసారి ఆవిరి పట్టాలి. వారానికోసారి స్క్రబ్‌ను ఉపయోగిస్తే మృతకణాలు తొలగడంతోపాటు ముఖమూ మృదువుగా మారుతుంది. స్నానం సమయంలో సెనగపిండి, బియ్యప్పిండిని సమపాళ్లలో తీసుకుని, నీటితో కలిపి ముఖానికి రుద్ది కడిగేసినా చాలు.

* మాయిశ్చరైజర్‌ చర్మాన్ని హైడ్రేట్‌ చేస్తుంది. గుర్తుండట్లేదు అనిపించిందా.. పిల్లలకు స్నానం తర్వాత తప్పక రాస్తారు కదా! ఆ సమయంలోనే మీ ముఖానికీ పట్టించేయండి. వాళ్ల బాడీ ఆయిల్‌, లోషన్‌ దేన్నైనా రాసుకోవచ్చు. సులువే అనిపిస్తోంది కదా! పాటించేయండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్