పోల్చొద్దు.. ప్రోత్సహించండి

చదువుల్లోనూ, ఆటపాటల్లోనూ పిల్లలు ముందుండాలని కోరుకోని అమ్మానాన్నలుండరు. అలా ఉన్నా.. ఉండేలా ప్రోత్సహించినా సరే. అది మితిమీరితే! చిన్ని మనసులకు ప్రమాదమంటున్నారు నిపుణులు.

Updated : 16 Nov 2021 06:04 IST

చదువుల్లోనూ, ఆటపాటల్లోనూ పిల్లలు ముందుండాలని కోరుకోని అమ్మానాన్నలుండరు. అలా ఉన్నా.. ఉండేలా ప్రోత్సహించినా సరే. అది మితిమీరితే! చిన్ని మనసులకు ప్రమాదమంటున్నారు నిపుణులు.

‘పిల్లల్లో ఒత్తిడి’ తరచూ వింటోన్న మాట. దీనికి పోలికా కారణమంటున్నారు. పదేపదే ఇతరులతో పోలుస్తోంటే ఆత్మవిశ్వాసం తగ్గి... డిప్రెషన్‌, స్వీయ హాని వరకూ వెళతారు. అపజయాన్ని స్వీకరించ లేరు. అబద్ధాలు, మోసాలు అలవాటయ్యేదీ అప్పుడే. ఒక్కోసారి అందరికీ దూరంగా ఉండటం, విమర్శలనూ తీసుకోలేకపోవడం, ప్రతిదానిలో వెనకబడటం అలవాటవుతాయి. విపరీతమైన కోపం, మితి మీరితే ఎవరికైనా హాని చేయడమో, ఇంట్లోంచి వెళ్లిపోవడమో జరగొచ్చు.

అలా జరగకూడదంటే.. పోల్చకండి. ఎవరికి వారే ప్రత్యేకం. వారికి నిజమైన ఆసక్తి దేనిలో ఉందో కనుక్కుని ప్రోత్సహించండి. పొరబాట్లు చెప్పండి. అది మృదువుగా ఉండాలే కానీ.. అవమానించినట్లుగా కాదు. మంచి పని చిన్నదైనా పొగడండి, ప్రోత్సాహమవుతుంది. ఓడినా అది సహజమని చెప్పండి. దాన్ని స్వీకరించేలా, ఇంకోసారి గట్టిగా ప్రయత్నించమని వెన్నుతట్టండి. సరదాగా బయటికి తీసుకెళ్లడం, వాళ్లతో ఆటలాడటం వంటివి చేయండి. దేన్నైనా పంచుకునే స్వేచ్ఛనివ్వండి. తప్పు చేసినపుడు మాత్రం కఠినంగా వ్యవహరించాలి. మంచికి ప్రోత్సాహం, తప్పు చేసే శిక్ష ఉంటాయన్న స్పష్టత వచ్చేలా వ్యవహరించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్