అమ్మాయిలకీ.. అమ్మలకీ బైజూస్‌ సెలవులు
close
Published : 17/11/2021 02:03 IST

అమ్మాయిలకీ.. అమ్మలకీ బైజూస్‌ సెలవులు

నెలసరిలో ఇబ్బందిని పంటి బిగువన భరించేవారే ఎక్కువ. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని మహిళలకు ప్రత్యేక సెలవులను ప్రకటిస్తూ స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు ఇప్పటికే ముందడుగు వేశాయి. ఇవి తమ మహిళా సిబ్బందికి ఏడాదికి 12, 10 రోజుల చొప్పున సెలవులు ప్రకటించాయి. ఆ నెలసరి ఇబ్బందిని అర్థం చేసుకున్న జాబితాలోకి బైజూస్‌ కూడా చేరింది. అయితే ఈ సంస్థ ఓ అడుగు ముందుకేసి పిల్లల రక్షణ సెలవుల్నీ జోడించింది. దీని ప్రకారం.. మహిళలకు ఏడాదికి 12 పిరియడ్‌ లీవ్స్‌తోపాటు 12 ఏళ్లలోపు పిల్లలున్నవారికి ఏడు అదనపు సెలవుల్నీ ఇవ్వనున్నారు. వీటిని ఒక్కసారే అయినా తీసుకోవచ్చు. ఒక్కోరోజు చొప్పున అవసరమైతే సగం రోజుల చొప్పునా తీసుకునే వీలు కల్పించింది. అంతేకాకుండా 26 వారాల జీతంతో కూడిన మాతృత్వ సెలవులకు అదనంగా 13 వారాలను జోడించారు. అయితే వీటికి చెల్లింపు ఉండదు. ఇదంతా వాళ్ల ఉద్యోగులకు ఆనందంగా, సౌకర్యవంతంగా పనిచేసే వాతావరణం కల్పించడం కోసమే అని బైజూస్‌ చెబుతోంది. వీటిని ఉద్యోగులకే పరిమితం చేయకుండా ట్రైనీలూ వినియోగించుకునే అవకాశం కల్పించింది. అమ్మాయిలే కాకుండా అమ్మల పరిస్థితినీ అర్థం చేసుకున్నారన్న మాట. అభినందనీయమే కదూ!


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని