వ్యాయామం తర్వాత..

ఆరోగ్యం కోసమో, అందం కోసమో... ఇప్పుడు చాలా మంది కసరత్తులు చేస్తున్నారు. అయితే వ్యాయామం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఆ తర్వాత కూడా కొన్ని టిప్స్‌ పాటించాలంటున్నారు నిపుణులు...

Updated : 19 Nov 2021 05:27 IST

ఆరోగ్యం కోసమో, అందం కోసమో... ఇప్పుడు చాలా మంది కసరత్తులు చేస్తున్నారు. అయితే వ్యాయామం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఆ తర్వాత కూడా కొన్ని టిప్స్‌ పాటించాలంటున్నారు నిపుణులు...

సరత్తులు చేసే సమయంలో శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెమట రూపంలో ఎక్కువ మొత్తంలో నీరు బయటకు వెళ్తుంది. అందుకే వర్కవుట్స్‌ పూర్తయ్యాక నీళ్లు తాగడం మరిచిపోవద్దు. దీని వల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుతుంది. డీహైడ్రేషన్‌ సమస్య ఎదురుకాదు.

* తీవ్రంగా శారీరక శ్రమ చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం, జీవక్రియల రేటు పెరుగుతుంది. శరీరంపై ఒత్తిడి సైతం అధికమవుతుంది. అందుకే వ్యాయామం తర్వాత కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం మరిచిపోవద్దు. అప్పుడే ఒత్తిడి తగ్గి చురుగ్గా ఉంటారు.

* వ్యాయామం పూర్తయ్యాక శరీర భాగాలను తప్పకుండా స్ట్రెచ్‌ చేయాలి. ఇలా ఒక్కో భాగాన్ని ముప్ఫై సెకన్ల పాటు చేయడం వల్ల కండరాలు సాధారణ స్థితికి చేరుకుంటాయి.

* కసరత్తుల తర్వాత శక్తి కావాలంటే ఏదో ఒకటి తప్పకుండా తినాలి. ఇందులో హై ప్రొటీన్‌ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఉత్సాహంగా ఉంటారు. మీ లక్ష్యమూ నెరవేరుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్