నిర్ణయం తీసుకునే ముందు...

రమణికి కెరీర్‌ ఎంచుకోవడంలో పెద్ద సమస్య ఎదురైంది. నచ్చినదాన్ని చెబితే తల్లిదండ్రులు అభ్యంతరం చెబుతున్నారు. దాంతో ఎటు వెళ్లాలో అర్థం కాక సతమతమవుతోంది.

Updated : 23 Nov 2021 05:56 IST

రమణికి కెరీర్‌ ఎంచుకోవడంలో పెద్ద సమస్య ఎదురైంది. నచ్చినదాన్ని చెబితే తల్లిదండ్రులు అభ్యంతరం చెబుతున్నారు. దాంతో ఎటు వెళ్లాలో అర్థం కాక సతమతమవుతోంది. అందుకే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాగా ఆలోచించాలంటున్నారు కెరీర్‌ నిపుణులు. ఈ సమస్యకు పరిష్కారం ఏం చెబుతున్నారంటే..

ఒత్తిడిగా... ఏదైనా నిర్ణయం తీసుకోవాలనే సమయం వచ్చినప్పుడు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి. ఒత్తిడితో మాత్రం ముందడుగు వేయకూడదు. ముందుగా మనసులోని ఆందోళన, ఒత్తిడి వంటి వాటిని దూరం చేయడానికి ప్రయత్నించాలి. ప్రశాంతంగా మాత్రమే సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అప్పటికప్పుడు హడావుడిగా ఆలోచించి తీసుకున్న ఏ నిర్ణయమూ మంచి ఫలితాలను ఇవ్వదు. ఇలాంటి సందర్భాల్లో ఏకాగ్రత, స్థిమితం కోసం లాంగ్‌ వాక్‌, యోగా వంటివి చేయాలి. లేదా స్నేహితులతో కాసేపు సరదాగా మాట్లాడాలి. కల్లోలం తగ్గి మనసు సాధారణ స్థాయికి చేరుకున్న తర్వాత తిరిగి ఆలోచిస్తే సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది.

పట్టికగా... మీ ముందున్న సవాల్‌తోపాటు దాని వల్ల భవిష్యత్తు ప్రయోజనాల హెచ్చు తగ్గులను ఓ పట్టికగా పొందుపరచాలి. అలా చేస్తే ఏం నిర్ణయం తీసుకోవాలో మీకే తెలుస్తుంది. అలాగే ఎదుటి వారి సలహాలను కూడా అందులో రాయాలి. అమ్మానాన్నలు, స్నేహితులతో ఈ వివరాలు చర్చించి, వారి అభిప్రాయాలను సేకరించాలి. సానుకూల ధోరణితో వారి కోణంలోనూ ఆలోచించాలి. మీకు నచ్చిన కెరియర్‌ను ఎంచుకున్న వారిని కూడా సంప్రదించడం మేలు. అందులో లోటుపాట్లు, ఆ కోర్సు చదివితే ఉద్యోగావకాశాలు ఎంతవరకు ఉన్నాయో పరిశీలించాలి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే చాలు. సరైన పరిష్కారాన్ని ఎంచుకోవడానికి వీలుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్