నేతృత్వానికి కావాలీ... నైపుణ్యాలు
close
Updated : 27/11/2021 05:52 IST

నేతృత్వానికి కావాలీ... నైపుణ్యాలు

కొందరమ్మాయిలకు ఉద్యోగంలో అర్హత, అనుభవం ఉన్నా నాయకత్వ అవకాశం రాదు. కెరియర్‌లో అభివృద్ధికి ఇది విఘాతమే. అయితే కొన్ని సామర్థ్యాలు, నైపుణ్యాలు లేకపోవడమూ కారణమవొచ్చు అంటున్నారు కెరియర్‌ నిపుణులు.

బాధ్యతనెరిగి.. బృంద సభ్యురాలిగా ఉన్నప్పుడే సొంతంగా నిర్వర్తించాల్సిన బాధ్యతలను గమనించుకోవాలి. పని తీరుపై పూర్తిగా అవగాహన తెచ్చుకుంటేనే ఇది సాధ్యం. అప్పుడే సమస్యలకు మీరు పరిష్కారాలు చూపగలుగుతారు. తోటి బృంద సభ్యులకు మర్యాదనిస్తూ, వారి అభిప్రాయాలకు విలువనిస్తూ సాగాలి. అందరినీ కలుపుకుంటూ సాగడం అలవరచుకోవాలి. మీ హద్దుల్లో మీరుంటూనే పనులు చేయించగలగాలి.

సానుకూలంగా.. పనిచేసే చోట సానుకూలమైన వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే ఒత్తిడికి గురి కాకుండా పని పూర్తవుతుంది. ఎవరైనా సమస్యలను మీ ముందుంచితే పూర్తిగా వినాలి. వాటికి పరిష్కారాన్ని అందిస్తారనే నమ్మకాన్ని కలిగిస్తేనే మీపై నమ్మకం కుదురుతుంది. అందుకోసం కృషి చేయగలగాలి. తోటివారి సూచనలకు మీ సలహాలు, ఆలోచనలను జోడించి విజయవంతంగా ముందడుగు వేస్తే చాలు. ఉన్నత స్థాయికి చేరుకునే అర్హత మీకు వచ్చినట్లే.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని