ఇలా చేస్తే.. సమన్వయం సులువే

మాన్విత.. పని విషయంలో అశ్రద్ధ చేయదు. పైగా వర్క్‌ ఫ్రం హోం. రోజంతా పని చేస్తున్నా.. పూర్తవ్వట్లేదనే భావన. కుటుంబానికీ సమయం కేటాయించలేకపోతోంది. కొన్ని చిట్కాలు పాటిస్తే సమన్వయం సులువే అంటున్నారు నిపుణులు.

Published : 28 Nov 2021 01:29 IST

మాన్విత.. పని విషయంలో అశ్రద్ధ చేయదు. పైగా వర్క్‌ ఫ్రం హోం. రోజంతా పని చేస్తున్నా.. పూర్తవ్వట్లేదనే భావన. కుటుంబానికీ సమయం కేటాయించలేకపోతోంది. కొన్ని చిట్కాలు పాటిస్తే సమన్వయం సులువే అంటున్నారు నిపుణులు.

రోజంతా చేసినా పని పూర్తి కావడం లేదంటే అది పని విభజనలో లోపమే. పనుల్ని.. ‘వెంటనే చేపట్టాల్సినవి - ముఖ్యమైనవి’, ‘ముఖ్యమైనవే - కానీ అర్జెంట్‌ కాదు’, ‘అర్జెంట్‌ - అయినా ముఖ్యమైనది కాదు’, ‘అర్జెంటు - ప్రాముఖ్యత లేనిది’ అంటూ విడదీసుకోవాలి. ఆ ప్రకారం ఒకదాని తర్వాత మరొకటి చేసుకుంటూ వెళ్లాలి. ఇలా చేస్తే అర్జెంట్‌వి ముందే పూర్తి అవుతాయి. కొంత సమయం ఉన్నవాటిని పక్కన పెట్టొచ్చు. కాస్త విశ్రాంతీ దక్కుతుంది. ఒత్తిడీ తగ్గుతుంది.

* ఏ సమయం అనుకూలం?
కొందరు ఉదయం ఉత్సాహంగా ఉంటే, మరికొందరు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వేగంగా చేయగలుగుతారు. మీకు ఏది అనుకూల సమయమో గుర్తించుకుని ఆ వేళల్లో కష్టమైన పనులు చేస్తే వేగంగా పూర్తవుతాయి. చివరి వరకూ పనుల్ని అట్టే పెట్టుకొని కూర్చోవద్దు. సమయం మించే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. పైగా రోజు చివరికొచ్చేసరికి శరీరం అలసి విశ్రాంతిని కోరుకుంటుంది. ఆ సమయంలో హడావుడిగా చేసినా పనులు పూర్తికాకపోవడమో, తప్పులు దొర్లడమో జరగొచ్చు.

* దేనికెంత!
ఏ పనికి ఎంత సమయం పడుతుందో ముందే ప్రణాళిక వేసుకోవాలి. దాని ప్రకారం కచ్చితంగా పూర్తి చేయాలి. సమయం మిగిలితే అప్పుడు వ్యక్తిగత పనులకు వినియోగించుకోవచ్చు. అలాగే సెలవుదినాలు, కుటుంబ సభ్యుల పుట్టిన రోజులు లేదా ప్రత్యేక సందర్భాల గురించి డైరీలో నోట్‌ చేసుకోవాలి. వాటి ప్రకారం పనుల్ని ప్రణాళిక ప్రకారం ముందే పూర్తి చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్