ఉత్తమ ఉద్యోగి మీరే..
close
Published : 29/11/2021 01:27 IST

ఉత్తమ ఉద్యోగి మీరే..

బాస్‌తో శెభాష్‌ అనిపించుకోవాలి. ప్రమోషన్ల నిచ్చెన ఎక్కాలి. అన్నింట్లో అప్‌డేట్‌ కావాలి.. అని మీకుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి.

* ప్రతి పనికి ప్రణాళిక వేసుకోండి. కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపండి. అవసరమైతే ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకండి.

* సంస్థ అభివృద్ధికి జరిగే చర్చల్లో చురుకుగా పాల్గొనండి. అయితే ఏ విషయం గురించి చర్చ జరుగుతుందో దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. మీరే సారథి అయితే మీ బృందాన్ని ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చర్యలు తీసుకోండి. వారికి తగిన సహాయ సహకారాలు అందించండి.

* ఎదుటివారు చెప్పేది విన్న తర్వాతే మీరు చెప్పాల్సిన విషయం చెప్పండి. పరిస్థితులకు తగ్గట్లుగా మిమ్మల్ని మీరు మలుచుకోండి.

* సవాళ్లను సంతోషంగా, ధైర్యంగా స్వీకరించాలి. ఈ క్రమంలో కొన్ని అవరోధాలు ఎదురైనా ధైర్యంగా నిలబడాలి. కొన్నిసార్లు పరాజయం పలకరించినా బాధపడొద్దు. మరింత ఉత్సాహంతో ముందుకు అడుగులు వేయాలి. ఆపత్కాలంలో కూడా దృఢంగా నిలబడి ఇబ్బంది నుంచి బయట పడే మార్గాలను అన్వేషించాలి. విపత్కర పరిస్థితులు మిమ్మల్ని మరింత శక్తిమంతంగా మారుస్తాయని విశ్వసించాలి.

* రోజుకో కొత్త విషయం తెలుసుకోవాలి/నేర్చుకోవాలి. పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవాలి. మీకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకోవాలి.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని