కొత్త కొలువులో కుదురుకోవాలా?

కళాశాల తర్వాత వెంటనే ఉద్యోగంలో చేరే అమ్మాయిలు రెండింటి మధ్యా తేడా చూసి కొంత ఇబ్బందిపడతారు. కొన్ని పొరబాట్లూ సహజమే. వీటి నుంచి తప్పించుకోవాలంటే ఈ విషయాలను ముందుగానే తెలుసుకోవాలి!

Updated : 30 Nov 2021 06:21 IST

కళాశాల తర్వాత వెంటనే ఉద్యోగంలో చేరే అమ్మాయిలు రెండింటి మధ్యా తేడా చూసి కొంత ఇబ్బందిపడతారు. కొన్ని పొరబాట్లూ సహజమే. వీటి నుంచి తప్పించుకోవాలంటే ఈ విషయాలను ముందుగానే తెలుసుకోవాలి!

వాయిదా వద్దు.. తర్వాత చేద్దామనే భావన విద్యార్థుల్లో సహజమే. ఉద్యోగ విషయంలో ఇది పనికిరాదు. కాబట్టి పనులను వాయిదా వేయొద్దు. లేదంటే చివర్లో ఇబ్బంది పడతారు. పైగా ఒత్తిడి. ఆలస్యమైనా, తప్పు చేసినా వ్యతిరేక అభిప్రాయం ఏర్పడే ప్రమాదముంటుంది.

సామాజిక మాధ్యమాలు.. మొబైల్‌ దానిలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టా సర్వసాధారణమయ్యాయి. విద్యార్థిగా ఉన్న స్వేచ్ఛ ఉద్యోగంలో ఉండదు. ఇక్కడ బాధ్యతలుంటాయి. వాటిని నిర్వర్తించాల్సిందే. పని ఏమీ లేదనిపిస్తే ఫోన్‌వైపు మళ్లడం, ఆ విశేషాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం చేయొద్దు. కొత్త కాబట్టి, కాస్త వెసులుబాటు కల్పిస్తుండొచ్చు. చొరవ తీసుకుని నేర్చుకునే ప్రయత్నం చేయండి.

సాయం అవసరమమే.. సహోద్యోగులతో కలసిమెలసి ఉండాలి. పని విషయంలో సహాయాన్నీ అందించాలి. అయితే దీనికీ పరిమితి ఉండాలి. కొత్త అనో, మొహమాటం కొద్దో వీలు లేకపోయినా పనులన్నీ మీదేసుకోవద్దు. వీలైనప్పుడు చేయండి. ఏమాత్రం కుదరకపోయినా చెప్పేసేయండి. మొదట్లో అలవాటు చేసి తీరా ఎప్పుడైనా చేయలేకపోతే నెగెటివ్‌ అభిప్రాయం రావచ్చు. ముందు నుంచే చేయలేని స్థితినీ అలవాటు చేస్తే భవిష్యత్‌లో సమస్యలుండవు.

పరిసరాలు పరిశుభ్రంగా... ఆఫీసు డెస్క్‌లో మీరు కూర్చొనే చోటు శుభ్రంగా చక్కగా ఉండేలా చూసుకోవాలి. వస్తువులన్నింటినీ టేబుల్‌పై పరిచేయొద్దు. ఎప్పటికప్పుడు సర్దుకోవాలి.

వీరికి దూరంగా.. కొందరు సహోద్యోగులు నెగెటివ్‌ భావాన్ని కలిగిస్తుంటారు. అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండటం మేలు. పని విషయంలో తప్పనిసరి అయితే తప్ప దూరం పాటించడమే మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్