మనసు చెప్పింది వినాలి..
చదువు, ఉద్యోగం, ఆలోచనా తీరుల్లో ఎంత ముందున్నా.. పెళ్లి విషయాన్ని మాత్రం చాలామంది అమ్మాయిలు తల్లిదండ్రులకే వదిలేస్తారు. దాన్ని వాళ్లకిచ్చే గౌరవంగా భావిస్తారు. మంచిదే! అయితే వివాహ విషయంలో నిర్ణయం వాళ్లదైనా.. మీ ఆలోచనలూ పంచుకోవాలి.
చదువు, ఉద్యోగం, ఆలోచనా తీరుల్లో ఎంత ముందున్నా.. పెళ్లి విషయాన్ని మాత్రం చాలామంది అమ్మాయిలు తల్లిదండ్రులకే వదిలేస్తారు. దాన్ని వాళ్లకిచ్చే గౌరవంగా భావిస్తారు. మంచిదే! అయితే వివాహ
విషయంలో నిర్ణయం వాళ్లదైనా.. మీ ఆలోచనలూ పంచుకోవాలి.
పెళ్లికి ముందే కాబోయే వ్యక్తితో మాట్లాడే అవకాశం ఇప్పుడు మామూలే. పెద్దలూ దీనికి అడ్డు చెప్పడం లేదు. అయితే ఈ సమయంలో ఆ వ్యక్తి మీకు సరిపోతాడో లేదో గమనించుకోవాలి. అబద్ధాలు చెబుతుంటడం, క్షణాల్లో మాట మార్చేయడం, ప్రతి చిన్న విషయంలోనూ నియంత్రించడం, భావోద్వేగాలను కించపరచడం వంటివి చేస్తుంటే వారికి దూరంగా ఉండటం మంచిది.
* మనసు చెబుతుంది.. ధైర్యంగా ఇంట్లో వాళ్లతో తన వల్ల మీరు పడే ఇబ్బందుల్ని చర్చించండి. నిజానికి అతను మీకు తగిన వ్యక్తేనా అనేది ముందు మీ మనసే గుర్తిస్తుంది. దాని మాట వినండి. సర్దుకుపోదాం అని అప్పటికప్పుడు కళ్లు మూసుకున్నా.. జీవితాంతం కుదరదు. ఆ అసంతృప్తి, వేదనల్ని మోయడం నరకమే. దాన్నుంచే ముందే బయటపడితే మేలు.
* చెప్పేయండి.. అతడివల్ల ఎదురైన అనుభవాలను అతనితోనూ నేరుగా చర్చించండి. ఇద్దరి ఆలోచనలు, భావోద్వేగాలు వేరువేరుగా ఉండటం వల్ల కలిసి ఉండటం కష్టమని చెప్పేయండి. మన వ్యక్త్తిత్వానికి సరిపడే వ్యక్తిని ఎంచుకుంటేనే జీవితాంతం సంతోషంగా జీవించొచ్చు. పెద్దలు కోరుకునేదీ మీ ఆనందమే! కాబట్టి.. పంటి బిగువున భరించక.. నోరు విప్పి చెప్పండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.