మీ కెరియర్ సూచికలివీ!
సహోద్యోగులతో సత్సంబంధాలు మొదలుకొని, కొత్త అవకాశాలు అందుకోవడం వరకు.. ఆఫీసులో మీ ప్రవర్తన తీరు అన్నింటిపైనా ప్రభావాన్ని చూపుతుంది. ఈ నైపుణ్యాలు మీ ప్రొఫెషనల్ కెరియర్‌కు సూచికగానూ మారతాయి. మరి వాటిపై దృష్టి పెడుతున్నారా?
సహోద్యోగులతో సత్సంబంధాలు మొదలుకొని, కొత్త అవకాశాలు అందుకోవడం వరకు.. ఆఫీసులో మీ ప్రవర్తన తీరు అన్నింటిపైనా ప్రభావాన్ని చూపుతుంది. ఈ నైపుణ్యాలు మీ ప్రొఫెషనల్ కెరియర్‌కు సూచికగానూ మారతాయి. మరి వాటిపై దృష్టి పెడుతున్నారా?
ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే సమయానికి కొన్ని నిమిషాల ముందే సీట్లో ఉండేలా చూసుకోండి. కొత్తల్లోనే కాదు.. కెరియర్ అంతటా ఈ విధానాన్ని అనుసరించాలి. కాబట్టి, ఇంటి నుంచే ప్లాన్‌ను అమలు చేయాలి. త్వరగా లేవడం, తయారు కావడం, ముందుగానే బయల్దేరడం వంటివాటికి ఇక్కడ చోటివ్వాలి.
డ్రెస్ కోడ్... కొన్ని సంస్థలు ఉద్యోగులకు డ్రెస్‌కోడ్‌ను పెడతాయి. కొన్నింట్లో ఉండకపోవచ్చు. మీ సంస్థ తీరు ఏదైనా ప్రొఫెషనల్ దుస్తులకే ప్రాధాన్యమివ్వాలి. మెరిసే, ఫ్యాషన్ వాటికి కాకుండా చూడగానే హుందాగా అనిపించే వాటినే ధరించాలి. ఇంటి నుంచి పని చేస్తున్నా ఇదే ధోరణి పాటించాలి.
ఎలా మాట్లాడుతున్నారు... మాట్లాడే విధానం సౌమ్యంగా ఉండాలి. తోటివారికి మర్యాదనివ్వాలి. ఇతరుల జీవితాల్లోకి దూరి చూడాలనుకోవడం, వేరేవాళ్ల విషయాలు మరొకరితో పంచుకోవడం లాంటివి చేయొద్దు. బృంద చర్చల్లో పాల్గొన్నప్పుడు నా మాటే నెగ్గాలన్న తీరు వద్దు. ఇతరులు చెప్పేదీ వినండి. అలాగే సంస్థకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. ఇంట్లో వాళ్లతో కూడా చర్చించొద్దు.
సానుకూల వైఖరి... సహోద్యోగులతో కలిసి పనిచేయండి. వారికేదైనా అవసరం వస్తే వీలైన సాయం చేయండి. ఒంటరిగా కాదు.. కలిసి సాగితేనే విజయం. సంస్థలూ అలాంటివాళ్లకే ప్రాధాన్యమిస్తాయి. ఉన్నత అవకాశాలు కల్పిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.