close
Published : 04/12/2021 00:47 IST

ప్రతికూల ఆలోచనలకు చెక్‌

పని పెరిగినా, ప్రాధాన్యం తగ్గినా.. నెగెటివిటీ, చిన్న విషయాలే పెద్దగా కనిపిస్తాయి. ఇది అనారోగ్యకరమే. ఇవి మరీ పెరిగితే పతనానికి దారితీస్తాయి. కొన్ని మంచి లక్షణాలను అలవాటు చేసుకుంటే వీటి నుంచి బయటపడొచ్చు.

మాట, ఆలోచన... అన్నీ సానుకూలంగా ఉండేలా చూసుకోండి. అలాగే ఉండటానికి ప్రయత్నించండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచే పనులు చేయండి. అభిరుచులకు మెరుగులు దిద్దండి. రోజూ తప్పనిసరిగా కాసేపు ధ్యానం చేసినా ఫలితం ఉంటుంది. రోజులో కొద్దిసేపు కుటుంబానికి కేటాయించండి. మనసు హాయిగా, తేలికగా ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లోనూ నెగెటివిటీకి దూరంగా ఉండండి.

క్షమించేయండి... కోపం ఎదుటివారి కంటే మనకు చేసే చేటే ఎక్కువ. వీలైతే క్షమించడం నేర్చుకోండి. ఆపదలో ఉన్నవారికి సాయం చేయండి. మనసులోని బాధ, ప్రతికూల భావనలు తగ్గి సంతోషం కలిగించే గొప్ప మార్గమిది. కాబట్టి అవసరమైన వారికి స్నేహపూరిత హస్తం అందించడానికి సిద్ధంగా ఉండండి.

వ్యాయామం.. తప్పకుండా ఓ గంట చేయాలి. వాయిదా వేయొద్దు. నృత్యం, జిమ్‌లో వర్కవుట్లు, యోగా... ఇలా నచ్చిన దాంట్లో దేన్నైనా ఎంచుకోవచ్చు. వ్యాయామంతో సంతోషాన్నిచ్చే ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. శరీరమూ ఫిట్‌గా ఉంటుంది.

గాసిప్స్‌కి నో.. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటివల్ల ఎదుటి వారికేమో కానీ మీ మనసు, మెదడు రెండూ అనారోగ్యంగా మారతాయి. ఇవన్నీ పాటించి చూడండి. సంతోషం మీ చెంత చేరుతుంది.


Advertisement

Tags :

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి