కాఫీతో బరువు తగ్గొచ్చు!

సూర్యుడికన్నా ముందే లేచే మనలో చాలామందికి కాఫీనే ఇంధనం. కొందరు పనిలోపడి ఆకలిని తట్టుకోవాలన్నా, ఒత్తిడి తప్పించుకోవాలన్నా దీని సాయమే తీసుకుంటారు. డైట్‌లో ఉన్న అమ్మాయిలు మాత్రం బరువు పెరుగుతారని దీన్ని దూరం పెడుతుంటారు.

Updated : 05 Dec 2021 06:02 IST

సూర్యుడికన్నా ముందే లేచే మనలో చాలామందికి కాఫీనే ఇంధనం. కొందరు పనిలోపడి ఆకలిని తట్టుకోవాలన్నా, ఒత్తిడి తప్పించుకోవాలన్నా దీని సాయమే తీసుకుంటారు. డైట్‌లో ఉన్న అమ్మాయిలు మాత్రం బరువు పెరుగుతారని దీన్ని దూరం పెడుతుంటారు. తెలుసా.. కాఫీనీ బరువు తగ్గేలా మార్చేసుకోవచ్చు. అదెలాగంటే..

ప్పు బ్లాక్‌ కాఫీకి అర నిమ్మచెక్క రసాన్ని కలపండి. దీనిలోని సి విటమిన్‌, సిట్రిక్‌ యాసిడ్‌ కొవ్వును కరిగించి, జీవక్రియలను సమతౌల్యం చేస్తాయి. టాక్సిన్లను బయటికి పంపుతాయి. కెఫిన్‌ శక్తిస్థాయిలను మెరుగుపరిచి, మంచి ప్రీ వర్కవుట్‌ డ్రింక్‌గా మారిపోతుంది.

* వెన్న, కొబ్బరినూనెతో.. బుల్లెట్‌ కాఫీగా పిలిచే ఇది డైటింగ్‌ చేస్తున్న వారికి మంచి చాయిస్‌. ఉప్పులేని వెన్న లేదా సహజ సిద్ధ కొబ్బరి నూనెను కాఫీకి కలపాలి. రోజూ దీన్ని ఓ కప్పు తీసుకుంటే చాలు. అవసరమైన కెలోరీలు అందడంతోపాటు బరువూ తగ్గిస్తుంది. ఈ కాఫీ ఒక కప్పు ఒక భోజనానికి సమానం.

* డార్క్‌ చాక్లెట్‌.. కాఫీలో డార్క్‌ చాక్లెట్‌/ తీపిలేని కోకోను కలపాలి. దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ కెఫిన్‌ కలిసి బరువు తగ్గడంలో సాయపడతాయి. ఎక్కువసేపు ఆకలీ వేయదు. చక్కర లేని డార్క్‌ చాక్లెట్‌ను ఎంచుకుంటే మంచిది.

* దాల్చిన చెక్క.. కప్పు కాఫీకి పావు చెంచా దాల్చినచెక్క పొడి లేదా కాఫీ కలిపే నీటిలో నేరుగా చిన్న దాల్చినచెక్కను వేసి మరిగించాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయులను, జీవక్రియలను సమన్వయం చేసి, అధిక బరువు తగ్గేలా చేయగలదు. కొవ్వును కరిగించి గుండెనూ ఆరోగ్యంగా ఉంచుతుంది. పావు చెంచా జాజికాయ పొడిని కాఫీలో కలిపి తాగితే.. దీనిలోని మాంగనీస్‌ కొవ్వును కరిగిస్తుంది. పీచు జీర్ణశక్తిని మెరుగుపరచి, అధిక బరువు సమస్య దరిచేరనివ్వదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్