కెరీర్‌ పురోగతిలో మీరెక్కడ...
close
Updated : 06/12/2021 05:25 IST

కెరీర్‌ పురోగతిలో మీరెక్కడ...

మధుమిత ఉద్యోగంలో చేరి అయిదేళ్లైంది. అంచెలంచెలుగా ఎదిగింది. తాను సాధించినఅభివృద్ధిని ఆధారంగా చేసుకునే  మరోచోట దరఖాస్తు చేయాలనుకుంటోంది. కెరీర్‌లో పురోభివృద్ధిని గుర్తించడానికి ఆరు స్థాయులున్నాయంటున్నారు నిపుణులు.

మొదటిస్థాయి.. కెరీర్‌లోకి అడుగుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరికీ తమ నైపుణ్యాలు తెలియకపోవచ్చు. సీనియర్స్‌ను అనుసరించి అడుగు వేసేదే ఈ స్థాయి.

రెండోది.. సహోద్యోగులు, పై అధికారులతో కలిసి పని నేర్చు కోవడమే రెండో స్థాయి. సహబృందంతో కలిసిమెలిసి  లక్ష్యాలను చేరుకోవడం. మొదలవుతుంది.

మూడో స్థాయిలో.. సహబృందానికి సలహాలు, సూచనలిచ్చే నైపుణ్యాలు పెరగడమే  మూడో స్థాయి. ఏ నిర్ణయం తీసుకుంటే లక్ష్యాలను త్వరగా చేరగలుగుతామనే స్వీయ ఆలోచనతో టీం లీడర్‌గా ఉండేదే ఈ స్థాయి.

నాలుగో స్థాయికి.. ఎక్కువ మంది ఉండే బృందాలకు నేతృత్వం వహించే స్థాయికి ఎదిగి మేనేజర్‌గా నిలబడటం.  

అయిదు.. మిగతా విభాగాల సిబ్బందికి కూడా సూచనలు ఇచ్చే స్థాయికి చేరుకుంటారు.

ఆరో స్థాయిలో లీడర్‌గా.. ఓ నాయకుడిగా ఎదుటివారిలో స్ఫూర్తిని కలిగించి, వారిని అభివృద్ధి దిశగా అడుగులు వేయించడమే ఆరోస్థాయిగా అనుకోవచ్చు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని