స్వార్థం పెంచుకోండీ
close
Published : 07/12/2021 00:50 IST

స్వార్థం పెంచుకోండీ!

మీరు విన్నది నిజమే! ఉదయం లేచినప్పటి నుంచీ కుటుంబం, పిల్లలు. ఇక ఉద్యోగమూ తోడైతే.. ఆఫీసు పని.  మన గురించి మనం ఆలోచించుకునేదెప్పుడు? ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు.  కాస్త స్వార్థంగా ఆలోచించి... మనకంటూ సమయమూ, స్థలమూ కేటాయించుకో మంటున్నారు.

ఫీసుకి ఆదివారమన్నా సెలవుంటుంది. ఇంటిపనికి ఆ అవకాశమేది? పైగా సెలవుల్లో ప్రత్యేక వంటలు, పిండి వంటల రూపంలో అదనపు భారం. ఎంత ఇష్టంగా, ప్రేమగా చేసినా శరీరానికీ కాస్త విశ్రాంతి కావాలిగా! పనిలో పడితే తిండీ గుర్తుండదు. ప్రతి ఉదయాన్నీ ఓ కప్పు టీ/ కాఫీతో ప్రారంభించండి. రోజూలా హడావుడిగా తాగేసేది కాదు. అలా ప్రకృతిని చూస్తూనో, చల్లగాలిని, సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూనో సేవించేయండి. రోజులో కొంత విరామ సమయాన్ని పెట్టుకోండి. పుస్తకం, ఆట, వ్యాయామం, ప్రోగ్రామ్‌.. వీటికి కేటాయించుకోండి. అందంపై దృష్టిపెట్టండి. యోగా, నడక, చిన్నచిన్న వ్యాయామాలు చేయండి. మనసూ, శరీరం రెండూ తేలికపడతాయి. ఇంకా ఉల్లాసంగా పనిచేస్తారు.

మరి స్థలం మాటేంటి? అంటారా! వీటిని ఏ కిచెన్‌లోనో, పడగ్గదిలోనో చేశారనుకోండి. ప్రత్యేకంగా ఏమీ అనిపించదు. అందుకే గది మూల, బాల్కనీ.. ఇలా నచ్చిన ప్రదేశంలో కొంత స్థలం ప్రత్యేకించుకోండి. ఒక కుర్చీ లేదా కార్పెట్‌ కూర్చొనే, పడుకునేంత స్థలముంటే చాలు. దానికి మొక్కలు, అభిరుచికి తగ్గట్టుగా చిన్న అలంకరణలు చేస్తే కొత్తదనం వచ్చేస్తుంది. సువాసనలు వెదజల్లే క్యాండిల్స్‌, డిఫ్యూజర్లనూ జతచేస్తే ఒత్తిడి దూరమవుతుంది. ఖాళీగా కూర్చున్నా.. అది మీ ప్రత్యేక సమయమేగా! స్వార్థం చూపించుకోండి మరి!


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని