ఉద్యోగ సంతృప్తికి సూత్రాలివీ
close
Published : 09/12/2021 01:15 IST

ఉద్యోగ సంతృప్తికి సూత్రాలివీ!

నిన్నమొన్నటి దాకా ఆడవాళ్లు ఉద్యోగం చేయాలా వద్దా అని ఆలోచించేవాళ్లు. చేస్తే చేయొచ్చు, లేదంటే ఇంటి బాధ్యతలతో సరిపెట్టుకోవచ్చు. ఏదో ఒక మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడలా కాదు.. దాదాపుగా తప్పనిసరే. ఈ క్రమంలో చేస్తున్న ఉద్యోగం సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వాలంటే కొన్ని సూత్రాలు అమలు చేయమంటున్నారు కెరియర్‌ గైడెన్స్‌ నిపుణులు.

మీరు చేపట్టిన వృత్తి మొక్కుబడిగా ఉంటే అది ఆనందాన్ని ఇవ్వకపోగా బరువులా తోస్తుంది. కనుక ఇష్టంగా చేయండి. అత్యున్నత స్థితికి వెళ్లడం లక్ష్యమవ్వాలి. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకుని, శ్రద్ధగా కృషి చేయండి. మీ పట్టుదలే ఆశయ సిద్ధిని చేకూరుస్తుంది.

అప్పగించిన పనుల్ని శ్రద్ధగా చేయండి. ఆ నేర్పూ నిజాయతీ మీకు గౌరవాన్ని తెచ్చిపెడతాయి. వెన్నుతట్టి ముందుకు నడిపించేవారిని ఎన్నడూ వదులుకోవద్దు. ప్రోత్సాహం టానిక్‌లా పనిచేస్తుందని గుర్తుంచుకోండి. ఏ రంగంలోనైనా మంచి వ్యక్తులతోబాటు అవరోధాలు కలిగించేవారు, నిరుత్సాహ పరిచేవారు కూడా ఉంటారు. వారికి దూరంగా ఉండండి. అనుకున్నది సాధించడం మీదే దృష్టి కేంద్రీకరించండి.

సీనియర్ల నుంచి మీరు చేయూత అందుకున్నట్లే జూనియర్లకు తగిన సాయం చేయండి. అది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మీ ఉన్నతికి కారణమవుతుంది. కంపెనీ సమావేశాల్లో ఇతరులు చెప్పింది వినడమే కాదు, మీ అభిప్రాయాలూ చెప్పండి. అవసరమైతే చర్చలూ జరపొచ్చు. మీ పనిని తోటివారు గమనించాలని ఎదురుచూడొద్దు. అది టియారా సిండ్రోమ్‌ అనిపించుకుంటుంది. మీ పని మీరు నిజాయతీగా చేయండి చాలు. ఫలితం అదే వస్తుంది.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని