పొడిచర్మానికి.. గులాబీ నీరు

మరీ జిడ్డు చర్మం వాళ్లు మినహా మిగతా ఎవరైనా ఈకాలంలో పొడిబారే సమస్యను ఎదుర్కోవాల్సిందే. క్రీమ్‌లను పట్టిస్తేనేమో ముఖం ఆయిలీగా తయారవుతుంది. మరెలా? రోజ్‌ వాటర్‌ సాయం తీసుకోండి. సమస్యకు చెక్‌పెడుతూనే అందంగానూ ఉంచుతుంది.

Updated : 11 Dec 2021 05:59 IST

మరీ జిడ్డు చర్మం వాళ్లు మినహా మిగతా ఎవరైనా ఈకాలంలో పొడిబారే సమస్యను ఎదుర్కోవాల్సిందే. క్రీమ్‌లను పట్టిస్తేనేమో ముఖం ఆయిలీగా తయారవుతుంది. మరెలా? రోజ్‌ వాటర్‌ సాయం తీసుకోండి. సమస్యకు చెక్‌పెడుతూనే అందంగానూ ఉంచుతుంది.
ఇంకా..
* పొడి చర్మానికి చక్కటి టోనర్‌లా పనిచేస్తుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై గీతలు, ముడతలను తగ్గించి వృద్ధాప్య ఛాయలను త్వరగా దరిచేరనీయవు. యాంటీ బ్యాక్టీరియల్‌ సమ్మేళనాలు మొటిమలు, మచ్చలను తగ్గించి చర్మాన్ని మెరిపిస్తాయి.
* యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు కంటి కింద వాపును తగ్గిస్తాయి. కళ్లు అలసినట్లుగా అనిపిస్తే దూది మీద కొన్ని చుక్కలు వేసి రెప్పలపై ఉంచండి. సాంత్వన కలుగుతుంది. శుభ్రమైన ముఖంపై స్ప్రే చేసుకుంటే మోముకు మెరుపుతోపాటు తాజాదనాన్నీ ఇస్తుంది.
* గులాబీ నీటిని సహజ మేకప్‌ రిమూవర్‌గానూ వాడుకోవచ్చు. రసాయనాలను తొలగించడమే కాదు.. చర్మానికి కావాల్సిన తేమనీ ఇస్తుంది. పీహెచ్‌ స్థాయులనూ సమతుల్యం చేస్తుంది. అన్ని చర్మతత్వాల వారికీ చక్కగా పనిచేస్తుంది. గ్లిజరిన్‌, రోజ్‌వాటర్‌ను సమాన పరిమాణాల్లో కలిపి రాస్తే స్కిన్‌ మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది. వెనిగర్‌తో సమాన పరిమాణంలో కలిపి మృదువుగా మర్దనా చేస్తే చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగి, చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్