మీకు మీరే టార్గెట్‌!

ఉద్యోగాలు బతుకుదెరువు కోసమే చేసినా అవి ఆనందాన్నీ పంచివ్వాలి. అలా కాకుండా అయిష్టంగా మొక్కుబడి వ్యవహారంగా చేస్తే అలటస, ఒత్తిడి పెరుగుతాయి. అదే ఇష్టంతో చేస్తే.. ఎంతటి కష్టమైనా సంతోషంగానే ఉంటుంది. అదనంగా ఉన్నత స్థానాలూ దక్కుతాయి.

Updated : 15 Dec 2021 03:22 IST

ఉద్యోగాలు బతుకుదెరువు కోసమే చేసినా అవి ఆనందాన్నీ పంచివ్వాలి. అలా కాకుండా అయిష్టంగా మొక్కుబడి వ్యవహారంగా చేస్తే అలసట, ఒత్తిడి పెరుగుతాయి. అదే ఇష్టంతో చేస్తే.. ఎంతటి కష్టమైనా సంతోషంగానే ఉంటుంది. అదనంగా ఉన్నత స్థానాలూ దక్కుతాయి. అలా మీ ఉద్యోగాన్నీ మలచుకోవచ్చు. అందుకు కెరియర్‌ గైడెన్స్‌ నిపుణులు ఇస్తున్న కొన్ని సూచనలు చదివేయండి.

ద్యోగం మోయలేని భారంగా అనిపిస్తోందంటే అది వృత్తిగతమైన సమస్యే కాదు, వ్యక్తిగత ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. కాబట్టి ఇష్టంగా చేయాలి. చేసే పనుల్లో ఎప్పటికప్పుడు సులువైన మార్గాలు తెలుసుకోవాలి. కొత్త మెలకువలు నేర్చుకోవాలి. పని తేలికవుతుంది.

* సమయంలోగా పనులు పూర్తి చేయలేకపోవడమే ఒత్తిడికి ప్రధాన కారణం. మరచిపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడం వంటివన్నీ కారణాలే. కాబట్టి, పూర్తి చేయాల్సిన పనులకు రోజూవారి, నెలవారి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి.. ఇలా నిర్దుష్టంగా ఉన్నప్పుడు ఉద్యోగంలో అభద్రత ఉండదు.

* పనిలో అలసత్వం వద్దు. పై అధికారి అడిగినప్పుడు చేద్దాంలెమ్మని జాగు చేయొద్దు. మీ లక్ష్యాలను మీరే పెట్టుకోండి. మీకూ హాయిగా ఉంటుంది, ఇతరులకూ మీమీద గౌరవం పెరుగుతుంది. మీకూ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.

* సమర్థంగా పనిచేయండి. ఒకరి గురించి కామెంట్‌ చేయడం, పుకార్లను పంచుకోవడం చేయకండి. మీమీద ఏవైనా వచ్చినా పట్టించుకోకండి. వాటికి పనితోనే సమాధానం చెప్పండి. ఇతరులు మీకేదైనా చెప్పినా విని ఊరుకోండి. అవసరమైతే వాటిని మీకు చెప్పొద్దని ఖరాకండిగా చెప్పేయండి. ఈ లక్షణాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని