కలిసి పనిచేయాలి

నీనా దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం కేవలం వ్యక్తిగతంగా విధులు నిర్వహించేలా ఉండేలా చూసుకుంది. తీరా ఎంపికైతే ఏం బాధ్యతలు అప్పగిస్తారో అని తన ఆందోళన. బృందంతో కలిసి పని చేసే అవకాశాన్ని ఇస్తే కాదనొద్దంటున్నారు కెరియర్‌ నిపుణులు.

Updated : 17 Dec 2021 05:13 IST

నీనా దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం కేవలం వ్యక్తిగతంగా విధులు నిర్వహించేలా ఉండేలా చూసుకుంది. తీరా ఎంపికైతే ఏం బాధ్యతలు అప్పగిస్తారో అని తన ఆందోళన. బృందంతో కలిసి పని చేసే అవకాశాన్ని ఇస్తే కాదనొద్దంటున్నారు కెరియర్‌ నిపుణులు.

* ఊహించాలి... ప్రకటనలో వివరాలను బట్టి దరఖాస్తు చేసుకున్నా ఎంపికలో సంస్థలు తమ అవసరాలకే ప్రాధాన్యత నిస్తాయి. ఇందులో భాగంగానే బృందంతో కలిసి పని చేయగలరా అని ప్రశ్నిస్తారు. ఇందుకు ఏం చెప్పాలో ఆలోచించుకుని వెళ్లాలి. లేదంటే అవకాశాన్ని జార విడుచుకున్నట్లే.

* అవగాహనతో.. టీంవర్క్‌కు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాలి. ఇందులో అనుభవం లేకపోయినా ఎలా దాన్ని దాటగలుగుతారో వివరించాలి. నెట్‌లో మాక్‌ ఇంటర్వ్యూలను పరిశీలిస్తే మంచి అవగాహన వస్తుంది.

* అందరినీ కలుపుకొని.. బాధ్యతల్లో అందరినీ కలుపుకొని వెళ్లడం, అందరినీ భాగస్వాములను చేయడం అవసరం. విజయంలోనూ ఎవరి క్రెడిట్‌ వారికి ఇవ్వాలి. మీ సమాధానం వీటికి అనుగుణంగానే ఉండాలి. గతంలో మీ ప్రాజెక్టులలో బృందంతో కలిసి సాధించిన విజయాలను చెబితే చాలు. ఈ సంస్థలో మీరు అవకాశాన్ని దక్కించుకున్నట్లే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్