Updated : 18/12/2021 04:41 IST

అనుకున్నది వెంటనే చేసేయాలి...

గణితం పట్ల ఉన్న ఆసక్తి, నైపుణ్యం నన్ను ఓ చిన్న పట్టణం నుంచి లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌కు నడిపించాయి. నిరంతరం పొదుపు మంత్రాన్ని జపంచేసే మనదేశ మైండ్‌సెట్‌తో పెరిగాను కనుక అదే ఆలోచనలతో క్యాష్‌కరో డాట్‌ కామ్‌ను ఆరంభించాను. అవరోధాలను అధిగమించాలి. మన శక్తియుక్తులను సంపూర్ణంగా వినియోగించుకోవాలి. అప్పుడే జీవితం అర్థవంతమవుతుంది. ‘వసంతం వెళ్లిపోయింది.. వేసవి జారి పోయింది.. చలి కాలం వచ్చింది.. ఆలపించాల్సిన గీతం అలాగే మిగిలి పోయింది..’ అనే ఠాగూర్‌ గీతం నాకు తరచూ గుర్తొస్తుంటుంది. కనుక అనుకున్న పనులు వెంటనే చేసేయాలి. డబ్బును దుబారా చేయొద్దు.. వచ్చే ఆదాయంలో కొంత సొమ్ము పొదుపు చేయండి, ఆనక తెలివిగా ఇన్వెస్ట్‌ చేయండి. ఏది ఎంత అవసరం, దేనికెంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేది గుర్తించి అమలుచేస్తే జీవితం సంతోషంగా సాగుతుంది, అభివృద్ధి సాధ్యమవుతుంది. నా మట్టుకు నేను కృషి, నైపుణ్యం, చలాకీతనం, అంకితభావం- ఈ నాలుగు లక్షణాలుంటే విజయం చేకూరుతుంది అనుకుంటాను.

- స్వాతి భార్గవ, కో ఫౌండర్‌, క్యాష్‌కరో


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి