Updated : 22/12/2021 04:59 IST

ఆమే.. ఆసరా

ఆడపిల్ల భారం అనుకునే రోజులకు కాలం చెల్లిపోయింది, ఆమె ఆసరాగా నిలుస్తుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అవును.. కూతురు తల్లికి సాయమే కాదు, ఇంటిల్లిపాదికీ తలలో నాలుకలా ఉంటుంది. అత్తగారింటికి వెళ్లినా పుట్టింటి మమకారాన్ని మర్చిపోలేని కూతుళ్ల గురించి మనోవిశ్లేషకులు ఏమంటున్నారంటే...

బాధ్యతకు ఇంకో పేరు కూతురు. తల్లికి కూరలు తరిగిస్తుంది. తండ్రికి దుస్తులు సిద్ధం చేస్తుంది. సోదరుడి వస్తువేదో వెతికి పెడుతుంది. చెల్లెలితో హోంవర్క్‌ చేయిస్తుంది. అందర్నీ కలుపుకొని సరదాగా సినిమాకో షికారుకో పదమంటుంది. కూతురి సందడి, సరాగాలు ఆత్మీయతను పెంచి ఆందోళన, డిప్రెషన్‌లను దరికి రానీయవు.

తన పనులు తాను చేసుకుంటూనే అందరి బాగోగులూ ఆలోచిస్తుంది.  ఆదరాభిమానాలు పంచుతూ, పొందుతూ ఆశయాల సాధనకు కృషి చేస్తుంది. కుటుంబసభ్యులు తమ నైపుణ్యాలను సమర్థంగా వినియోగించేలా చూస్తుంది.

అందాకా తన బాధను తల్లితో చెప్పుకున్న కూతురు యుక్తవయసు రాగానే తల్లి కష్టసుఖాల గురించి ఆరా తీస్తుంది. పరిష్కార మార్గాల గురించి చర్చిస్తుంది.

కుటుంబసభ్యుల మధ్య వచ్చే పేచీల్లో సయోధ్య కుదర్చడంలో కూతుళ్లదే పైచేయి. అందరితో కలివిడిగా ఉంటూ, కబుర్లు చెబుతూ ఇటుకగోడల ఇంటిని స్వీట్‌హోంగా మారుస్తుంది.

తల్లి ఎవరిమీది కోపమో తన మీద చూపినా ఎదురుచెప్పక, ఇంటి పరిస్థితిని, అమ్మ మనస్థితినీ అర్థంచేసుకుని మసలుకునేది కూతురే. మంచి, చెడు.. అన్నిటి నుంచీ ఎన్నో నేర్చుకుని రాటుతేలే ఇవాళ్టి కూతుళ్లే రేపటి ఆదర్శ కోడళ్లు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి