నిర్ణయం తీసుకునే ముందు...

శ్రీముఖికి హాజరైన ఎంట్రన్స్‌ పరీక్షలన్నింటిలోనూ మంచి మార్కులొచ్చాయి. ఇప్పుడు ఏ రంగాన్ని కెరియర్‌గా ఎంచుకోవాలో అని ఆందోళన చెందుతోంది.  మెడిసిన్‌ చదవాలని ఉంది. మరోవైపు సివిల్స్‌ తీసుకుని ప్రజాసేవ చేయాలని ఉంది. ఇటువంటప్పుడు మాత్రమే కాదు, కెరియర్‌కు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొన్ని సూచనలు ఇస్తున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

Updated : 25 Dec 2021 05:23 IST

శ్రీముఖికి హాజరైన ఎంట్రన్స్‌ పరీక్షలన్నింటిలోనూ మంచి మార్కులొచ్చాయి. ఇప్పుడు ఏ రంగాన్ని కెరియర్‌గా ఎంచుకోవాలో అని ఆందోళన చెందుతోంది.  మెడిసిన్‌ చదవాలని ఉంది. మరోవైపు సివిల్స్‌ తీసుకుని ప్రజాసేవ చేయాలని ఉంది. ఇటువంటప్పుడు మాత్రమే కాదు, కెరియర్‌కు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొన్ని సూచనలు ఇస్తున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

ఒత్తిడి తగ్గే వరకు ఏ నిర్ణయాన్నీ తీసుకోకూడదు. లేదంటే మంచి ఫలితాలు దక్కవు. భవిష్యత్తులో ఈ రంగంలో ఎందుకు అడుగుపెట్టానా అని అనిపించకూడదు. మనసుకు నచ్చినదే కాదు, దానికి భవిష్యత్తు ఉందో లేదో కూడా ఆలోచించ గలగాలి. సరైన అవకాశాలు దక్కుతాయో లేదో విశ్లేషించుకోవాలి. ఇవన్నీ ఆలోచించాలంటే కాస్త ప్రశాంతంగా ఉండాలి.

కెరీర్‌పై పూర్తి అవగాహన ఉన్నా కొన్ని సందర్భాల్లో ఆ రంగంలో మీరనుకున్న ప్రత్యేకతలు లేకపోవచ్చు. ముందుగా తెలిసిన, అనుభవజ్ఞుల వద్ద సమాచారాన్ని సేకరించాలి. ప్రస్తుత పరిస్థితిని మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఆ కెరీర్‌ మీరనుకున్న ఫలితాలను ఇస్తుందా లేదా అని అంచనా వేయగలగాలి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడాలి.

లక్ష్యంవైపు వెళ్లాలనుకోవడం సరైనదే. అయితే ఎంతవరకు సాధ్యపడుతుందో కూడా ఆలోచించాలి. మీరనుకున్న మార్గం గురించి ఇతరులు చెప్పేదాన్ని పూర్తిగా వినాలి. కష్టనష్టాలు తెలుసుకోవాలి. ఎందుకంటే అటువైపు  అడుగులేయాలనుకుంటున్న మీకు ఆ మార్గం గురించి పూర్తిగా అవగాహన ఉంటే మంచిదే కదా.  

మీ ఆలోచనలను ఎప్పటికప్పుడు ఓ డైరీలో పొందుపరచడం మరవకూడదు. ఇలా చేస్తే ఒత్తిడి కూడా దూరమవుతుంది. కొంత సమయం తర్వాత మీరు రాసిన వాటిని చదివితే దాంట్లోంచి కొత్త ఆలోచన పుట్టడానికి అవకాశం ఉంటుంది. నిర్ణయం తీసుకునే ముందు దానిపై ఇతరుల అభిప్రాయాన్ని వినడమే కాకుండా, మీరెందుకు ఆ దిశగా వెళ్లాలనుకుంటున్నారో వారికి అవగాహన కలిగించడానికి  ప్రయత్నించొచ్చు. చర్చల ద్వారా కూడా మంచి నిర్ణయం వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని