ఓడితే తప్పేంటి?

లహరి సమయానికి ప్రాజెక్ట్‌ను పూర్తిచేయలేక పై అధికారివద్ద అవమానాన్ని ఎదుర్కొంది. ఇలా జరగడం మూడోసారి. దాంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఇటువంటి సమయంలో సానుకూలంగా ఆలోచించాలంటున్నారు కెరీర్‌ నిపుణులు..

Published : 27 Dec 2021 00:42 IST

లహరి సమయానికి ప్రాజెక్ట్‌ను పూర్తిచేయలేక పై అధికారివద్ద అవమానాన్ని ఎదుర్కొంది. ఇలా జరగడం మూడోసారి. దాంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఇటువంటి సమయంలో సానుకూలంగా ఆలోచించాలంటున్నారు కెరీర్‌ నిపుణులు..

గుర్తించాలి... బాధ్యతల్లో భాగంగా ఎక్కడ పొరపాటు జరిగిందో ముందుగా గుర్తించడానికి ప్రయత్నించాలి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించగలగాలి. జరిగిన పొరపాటును ఎదుటివారిపై వేయడం అలవాటుంటే ముందు దాన్ని దూరంగా ఉంచాలి. ప్రాజెక్టు ఫెయిల్‌ అయ్యిందంటే అది మొత్తం అందరికీ సంబంధించిన అంశంగా భావించాలి. అప్పుడే సమష్టిగా కృషి చేయడానికి ముందడుగు వేయొచ్చు.

చర్చించాలి... ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి నుంచి ప్రతి అంశాన్ని, చేపట్టిన పనిని వరుసక్రమంలో బోర్డుపై రాయాలి. బృందసభ్యులందరి ఎదుట వీటన్నింటిపై చర్చించాలి. ఎలా చేస్తే ఇది సక్సెస్‌ అయ్యేదో

అడుగుతూ... అందరి ఆలోచనలు సేకరించి, వాటన్నింటినీ ఒక చోట పొందుపరచాలి. అలాగే ఎక్కడ పొరపాటు జరిగిందో కూడా చర్చించడానికి వెనుకాడకూడదు. సమావేశంలో అందరికీ స్వేచ్ఛనిచ్చి వారి అభిప్రాయాలకు విలువనిస్తూ పూర్తిగా వినాలి. చివరిసారిగా దక్కిన అవకాశాన్ని జారవిడుచుకోకూడదనే లక్ష్యాన్ని బృందానికీ వచ్చేలా చేయాలి. సభ్యులందరితో సమాలోచన చేస్తే సరైన మార్గం కనబడొచ్చు.

లక్ష్యం అందరిదీ...  ప్రాజెక్ట్‌ను సక్సెస్‌గా ముగించడం అందరి లక్ష్యంగా భావించేలా అవగాహన కలిగించాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ దాన్ని బాధ్యతాయుతంగా తీసుకుంటారు. తమవంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తారు. ఐకమత్యంగా కష్టపడితే విజయాన్ని సాధించగలమనే నమ్మకాన్ని బృందంలో  కలిగించడమే కాదు, ఆ దిశగా నడిపించే బాధ్యత చివరిగా టీమ్‌ లీడర్‌దే అవుతుంది. చివర్లో దక్కే సత్ఫలితాలు అందరివీ అనే భావన టీమ్‌కు కలిగిస్తే చాలు... సమష్టి కృషికి విజయం దానంతట అదే వచ్చి చేరుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్