ముందు.. వినండీ

నిత్యం మనల్ని ప్రేమిస్తూ, అండగా నిలిచేవాళ్లు ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు? అలాంటి బలమైన బంధం కావాలంటే ఒక్కటే ఆయుధం అంటున్నారు నిపుణులు. అదే.. వినడం!మర్యాద..

Updated : 29 Dec 2021 05:27 IST

నిత్యం మనల్ని ప్రేమిస్తూ, అండగా నిలిచేవాళ్లు ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు? అలాంటి బలమైన బంధం కావాలంటే ఒక్కటే ఆయుధం అంటున్నారు నిపుణులు. అదే.. వినడం!

మర్యాద.. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఆసక్తిగా సంభాషణ మొదలుపెడితే, పూర్తిగా వినాలి. అప్పుడే వారేం చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాకాక ఏకాగ్రత వేరే చోట ఉంచి, మొక్కుబడిగా విన్నట్లుగా నటిస్తే వారికి నిరాశ మిగులుతుంది. ఎదుటి వ్యక్తికి మర్యాదనిచ్చి చెప్పేది పూర్తిగా వింటే చాలు. వారి సమస్యకు పరిష్కారం ఇవ్వలేకపోయినా కొంత ఉపశమనమైనా అందించిన వారమవుతాం.

సహనం... కుటుంబంలో తగాదాలు తారస్థాయికి చేరుకోవడానికి ముఖ్యకారణం భాగస్వామి చెప్పేది పూర్తిగా వినకపోవడమే. అవతలి వారి మనసును తెలుసుకోవాలంటే వారు మాట్లాడేదంతా సహనంగా వింటే చాలు. సమస్య సగం తీరిపోతుంది. వారి ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకునే అవకాశమూ దక్కుతుంది. ఇరువురి బంధం మరింత బలపడుతుంది.

భరోసా ఇచ్చినట్లే.... పిల్లల మనసులో స్థానాన్ని సంపాదించాలంటే వారితో మాట్లాడటానికి సమయాన్ని కేటాయించడమే కాదు... చెప్పేది పూర్తిగా వింటే చాలు. వారి మాటల ద్వారా వ్యక్తిగతమైన లేదా స్నేహితులతో ఏర్పడే సమస్యలను తెలుసుకోవచ్చు. అప్పుడే వాటికి పరిష్కారాన్ని అందించడానికి ప్రయత్నించొచ్చు. అలా కాకుండా నువ్వేం చెప్పకు... నీ గురించి నాకు తెలుసు అని కోప్పడితే... పిల్లలు మరొకసారి మాట్లాడటానికి ఆసక్తి చూపించరు. ఇది చాలా ప్రమాదకరం. అందుకే వారు చెప్పేది పూర్తిగా విని, చేయూతనందించడానికి సిద్ధంగా ఉన్నామంటూ తల్లిదండ్రులు అందించే భరోసా వారికి కొండంత అండ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్